త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green India Challenge | ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం

ఈ కార్తిక మాసంలో అటు ఆరోగ్యం, ఇటు భక్తి పెంపొదించేలా ప్రతి ఇంటా ఉసిరి..ప్రతి గుడిలో బిల్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉసిరి, బిల్వ మొక్కలను ప్రతి ఊరికి పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మంగళవారం (నవంబరు 10) ఈ కార్యక్రమాన్ని తన నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు.

a

News | Published On Nov 11, 2026, 12.03 pm IST

Green India Challenge | ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం

సంక్షిప్త సారాంశం

పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకుని, భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాల్లో విశిష్ట స్థానం కలిగిన ఉసిరి, బిల్వ వృక్షాల ప్రాధాన్యతను చాటుతూ, పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ “కార్తీక హరిత సంకల్పం” కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి ఇంట్లో, ప్రతి ఆలయంలో, ప్రతి పాఠశాలలో ఉసిరి మరియు బిల్వ మొక్కలను నాటి, వాటిని సంరక్షించేలా ప్రజల్లో అవగాహన కల్పించడం. భక్తి భావాన్ని ప్రకృతి పరిరక్షణతో మేళవిస్తూ, మన సంప్రదాయ వృక్ష సంపదను భావితరాలకు అందించడమే ఈ హరిత సంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం.

Advertisement
  • ప్రతి ఇంటా ఉసిరి

  • ప్రతి గుడిలో బిల్వం

  • కార్తిక మాసంలో గ్రీన్ ఇండియా చాలెంజ్

  • సరికొత్త హరిత సంకల్పం

  • తన నివాసంలో ఉసిరి, బిల్వ మొక్కలు నాటి

  • కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్

  • 11 నుంచి మొక్కల పంపిణీ

హైదరాబాద్, నవంబర్ 11 ,2026:

ధరిత్రిని హరితమయంగా మార్చాలనే సంకల్పంతో పనిచేస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది. ఆధ్యాత్మిక ప్రాశస్త్యత కలిగిన ఈ కార్తిక మాసంలో అటు ఆరోగ్యం, ఇటు భక్తి పెంపొదించేలా ప్రతి ఇంటా ఉసిరి..ప్రతి గుడిలో బిల్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉసిరి, బిల్వ మొక్కలను ప్రతి ఊరికి పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) మంగళవారం (నవంబరు 10) ఈ కార్యక్రమాన్ని తన నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి ఇంట్లో ఉసిరి..ప్రతి గుడిలో బిల్వం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలకు నవంబరు 11 నుంచి ఉసిరి, బిల్వ మొక్కలు పంపిణీ చేయనున్నారు.

ఉసిరితో విష్ణు ఆరాధన..బిల్వంతో శివ ఆరాధన

యుగాల్లో కృతయుగం, శాస్త్రాల్లో వేదం, తీర్థాల్లో గంగ, మాసాల్లో కార్తికం అత్యుత్తమైనవని స్కంధ పురాణం ప్రవచిస్తున్నది. కార్తిక మాసంలో శివ, కేశవుల ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. విష్ణువుకు ఉసిరి, శివునికి బిల్వం ప్రీతికరమైనవని..ఈ రెండు వృక్షాలను పూజించడం ద్వారా లక్ష్మీ నారాయణుల, పరమ శివుని అనుగ్రహం లభిస్తాయని స్కంధ పురాణం, పద్మ పురాణం, శివ మహా పురాణాలు ప్రస్తావిస్తున్నాయి. కార్తిక మాసంలో లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావించే ఉసిరి చెట్టుకు పూజ చేయడం,
దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉసిరి దీపాలు పెట్టడంతో సకల దోష నివృత్తి జరిగి శుభాలు కలుగుతాయని పురాణాలు తెలుపుతున్నాయి. పైగా ఈ మాసంలో కార్తిక వన భోజనం ఆరోగ్యానికి శ్రేయస్సును ఇవ్వడంతో పాటు బంధుమిత్రుల మధ్య అనురాగాలు పెంపొందించేందుకు దోహద పడుతుందని విశ్వసిస్తారు. ఇక బిల్వ పత్రాలతో కార్తిక మాసంలో శివ ఆరాధన చేయడం ద్వారా వంశ పారంపర్య దోషాలు తొలగిపోయి అష్టైశ్వరాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

కార్తిక మాసంలో మరో హరిత సంకల్పం

పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకుని, భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాల్లో విశిష్ట స్థానం కలిగిన ఉసిరి, బిల్వ వృక్షాల ప్రాధాన్యతను చాటుతూ, పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ “కార్తీక హరిత సంకల్పం” కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి ఇంట్లో, ప్రతి ఆలయంలో, ప్రతి పాఠశాలలో ఉసిరి మరియు బిల్వ మొక్కలను నాటి, వాటిని సంరక్షించేలా ప్రజల్లో అవగాహన కల్పించడం. భక్తి భావాన్ని ప్రకృతి పరిరక్షణతో మేళవిస్తూ, మన సంప్రదాయ వృక్ష సంపదను భావితరాలకు అందించడమే ఈ హరిత సంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం.
“వృక్షాలు మనకు జీవితాన్నిస్తున్నాయి. ఇళ్లల్లో చల్లటి నీడనిస్తున్నాయి. ఆలయాల్లో మూల విరాట్టులతో సమానంగా మామత్మ్యాన్ని కలిగి భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొంటున్నాయి. మన జీవితాలతో వృక్షాలు ముడివేసుకొని ఉన్నాయి. వృక్షాల మహత్తు గురించి అష్టాదశ పురాణాల్లో అనేక చోట్ల ప్రస్తావించి ఉంది. అటువంటి వృక్షాలను మనం పెంచి పెద్ద చేసి కాపాడాలి. ఆ ఫలాలు మన తర్వాతి తరాలు పొందేలా ఓ మంచి సంస్కృతిని ఆచరించాలి. ఇందులో భాగంగానే ఆధ్యాత్మిక హితం కోసం సమాజ శ్రేయస్సు కోసం ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఇంటా ఉసిరి..ప్రతి గుడిలో బిల్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ మొక్కలను పంపిణీ కూడా చేస్తున్నాం. అందరూ ఈ వృక్షాలు నాటితే.. అటు భక్తి ఇటు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ప్రజలందరినీ ఈ హరిత సంకల్పంలో పాల్గొని, కార్తీక మాసాన్ని పర్యావరణ సంరక్షణ మాసంగా మార్చాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రజలందరినీ ఈ హరిత సంకల్పంలో పాల్గొని, కార్తీక మాసాన్ని పర్యావరణ సంరక్షణ మాసంగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నది." అని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చెప్పారు.

సందర్భమేదైనా..హరితమే ఇతివృత్తం

2018లో నాటి రాజ్య సభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. యావత్ ధరిత్రిని హరితమయంగా మార్చే సంకల్పంతో ప్రారంభమైన ఈ చాలెంజ్ స్ఫూర్తితో ఇప్పటికే కోట్ల ది మొక్కలను దేశ వ్యాప్తంగా నాటారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం శత జయంతి రోజైన 2031 అక్టోబరు 15 నాటికి వంద కోట్ల మొక్కలు నాటాలన్నది గ్రీన్ ఇండియా సంకల్పం. తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా అసోంలో కోటి మొక్కలు, పశ్చిమ బెంగాల్ లో సుందర్ బన్ మడ అడవుల పునరుద్ధరణ, తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య గోదావరి పరీవాహక ప్రాంతం అంతటా 99 లక్షల చెట్లను నాటి సంరక్షించడం వంటి ముఖ్యమైన హరిత కార్యక్రమాలు చేపట్టింది. కాగా భారత దేశంలో పర్యావరణాన్ని కాపాడేందుకు శ్రమిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ ను గత జూన్ లో బ్రిటన్ పార్లమెంట్ ప్రశంసించింది. గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ..వరల్డ్ లీడర్స్ కాన్ క్లేవ్ (World leaders Conclave)లో గ్లోబల్ గ్రీన్ ఐకాన్ (Global Green Icon) అవార్డును ప్రదానం చేశారు.

Santosh Kumar J on X: "Kartika Harita Sankalpam – Every Home a Usiri, Every Temple a Bilva! In the auspicious month of Kartika, we are taking another step towards blending our rich spiritual traditions with environmental conservation. Proud to launch “Kartika Harita Sankalpam”, an initiative of… / X

 

Advertisement
Advertisement