Petrol Diesel Prices | లీటర్‌పై 90 పైసలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Prices | పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) మళ్లీ పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు లీటరు పెట్రోల్, డీజిల్‌పై 90 పైసల చొప్పున భారం మోపాయి. దీంతో ఐదు రోజుల వ్యవధిలో ధరలు పెరగడం ఇది రెండోసారి.
Petrol Diesel Prices | త్రినేత్ర.న్యూస్: వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Prices) మళ్లీ పెంచింది. లీటరు పెట్రోల్, డీజిల్‌పై 90 పైసల చొప్పున భారం మోపించింది. దీంతో ఐదు రోజుల వ్యవధిలో ధరలు పెరగడం ఇది రెండోసారి. పెరిగిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి.
తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.98.64గా ఉండగా, డీజిల్ రూ.91.58కి పెరిగింది. ముంబైలో పెట్రోలు 91 పైసలు పెరిగి రూ.107.59కి చేరగా, డీజిల్ 94 పైసలు పెరిగి రూ.94.08గా ఉంది. చెన్నైలో రూ.104.49, డీజిల్ రూ.96.11, కోల్‌కతాలో పెట్రోల్ రూ.109.70, డీజిల్ రూ.96.07గా ఉంది.
హైదరాబాద్‌లో ఎంతంటే..
హైదరాబాద్‌లో- పెట్రోల్ రూ.111.36, డీజిల్ రూ.99.53
బెంగళూరు- పెట్రోల్ రూ.106.82, డీజిల్ రూ.94.82
పాట్నా- పెట్రోల్ రూ.109.40, డీజిల్ రూ.95.61
జైపూర్- పెట్రోల్ రూ.108.89, డీజిల్ రూ.94.32
తిరువనంతపురం- పెట్రోల్ రూ.111.24, డీజిల్ రూ.100.09
చండీగఢ్- పెట్రోల్ రూ.99.16, డీజిల్ రూ.86.28
ఐదు రోజుల క్రితమే..
కాగా, గత శుక్రవారం (ఈ నెల 15) లీటరు పెట్రోలు, డీజిల్‌పై రూ.3 చొప్పున పెరిగిన విషయం తెలిసిందే. సీఎన్‌జీపై కూడా కిలో లీటర్‌కు రూ.2 పెరిగింది. ఆదివారం మరోసారి రూ.1 చొప్పున దేశీయ చమురు కంపెనీలు వడ్డించాయి. దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో యుద్ధం.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






