త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Election Boycott | క‌రెంట్, నీళ్లు లేవ్‌.. ఓటేయం.. ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిన 50 కుటుంబాలు

Election Boycott | త‌మిళ‌నాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నిక‌ల (Assembly elections) వేళ నందవనం (Nandavanam) గ్రామానికి చెందిన ప్ర‌జలు కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి ఓటేయ‌బోమ‌ని తెగేసి చెబుతున్నారు. త‌మ‌కు 16 ఏళ్లుగా కరెంట్, నీరు, మరుగుదొడ్లు లేవని అందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామ‌ని (Election Boycott) 50 కుటుంబాల‌(50 families)కు చెందిన ప్రజ‌లు ప్ర‌క‌టించారు.

S

News | Published On Mar 26, 2026, 1.37 pm IST

Election Boycott | క‌రెంట్, నీళ్లు లేవ్‌.. ఓటేయం.. ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిన 50 కుటుంబాలు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: త‌మిళ‌నాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నిక‌ల (Assembly elections) వేళ నందవనం (Nandavanam) గ్రామానికి చెందిన ప్ర‌జలు కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి ఓటేయ‌బోమ‌ని తెగేసి చెబుతున్నారు. త‌మ‌కు 16 ఏళ్లుగా కరెంట్, నీరు, మరుగుదొడ్లు లేవని అందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామ‌ని (Election Boycott) 50 కుటుంబాల‌ (50 families)కు చెందిన ప్రజ‌లు ప్ర‌క‌టించారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించే వరకు ఓటు వేయ‌మ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు.

 16 ఏళ్లుగా న‌ర‌కం...

తిరుచిరాపల్లిలోని నందవనం గ్రామానికి చెందిన 50కి పైగా కుటుంబాలు 16 ఏళ్లుగా స‌రైన స‌దుపాయాలు లేక తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. జాతీయ రహదారిని విస్తరించే సమయంలో తమ ఇళ్లను ఖాళీ చేయించి నందనవం గ్రామానికి తరలించారని వాపోయారు. ఇక్కడ సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ఆవేద‌న చెందుతున్నారు. ఇంతవరకు ఎటువంటి ప్రాథ‌మిక‌ అవసరాలు కల్పించలేదని, తాము ఎలా బ‌తుకును వెళ్ల‌దీసేద‌ని నందవనం గ్రామనికి చెందిన స్థానికుడు తంగరాజ్​ త‌న గోడు వెల్ల‌బోసుకున్నాడు.

న‌లుగురు సీఎంలు మారినా...

జాతీయ రహదారి పక్కన ఉండేవాళ్లమ‌ని, ఇక్కడికి త‌ర‌లించిన‌ప్ప‌టి నుంచి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రులు మారారని క‌నీస సౌక‌ర్యాలైన‌ కరెంట్, తాగునీరు, మరుగుదొడ్లు, వ్యవసాయానికి మద్దతు వంటి విష‌యాల్లో ఎవ‌రూ సాయం చేయ‌క‌పోవ‌డం బాధ క‌లిగిస్తోంద‌ని, వెంట‌నే త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని తంగ్​రాజ్ తో పాటు స్థానికులు డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చిన‌ప్ప‌టికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తంగరాజ్ ఆరోపించారు. దీంతో ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

తమిళనాడులో మరో 10 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ మొదల‌వ‌నుంది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాను ఇప్ప‌టికే వెలువ‌రించాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండ‌గా బాధిత ప్ర‌జ‌ల ప‌రిష్కారానికి ఎవ‌రైనా చొర‌వ తీసుకుంటారో లేదోన‌ని ఎదురు చూస్తున్నారు.

https://x.com/hashtag/WATCH?src=hashtag_click

Advertisement

తాజావార్తలు

Advertisement