Gas | గ్యాస్ కోసం ఆటో డ్రైవర్ల పాట్లు.. మల్లేపల్లిలో 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లు..
Gas | రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ (Gas) కొరత లేదని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ వాహనదారుల్లో భయాందోళనలు పోవడం లేదు. ఇంధన కొరత ఉందనే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సహా అధికారులు చెబుతున్నా పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్ల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు.
Gas | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ (Gas) కొరత లేదని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ వాహనదారుల్లో భయాందోళనలు పోవడం లేదు. ఇంధన కొరత ఉందనే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సహా అధికారులు చెబుతున్నా పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్ల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఆసిఫ్‌నగర్–మల్లేపల్లి ప్రాంతంలో గ్యాస్ కోసం ఆటోలు భారీగా క్యూలో ఉన్నాయి. దీంతో సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు లైన్లు ఏర్పడింది.
శామీర్‌పేట దత్తాత్రేయ భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 6 గంటల నుంచే గ్యాస్ సిలిండర్లతో వినియోగదారులు క్యూ లైన్ కట్టారు. సుమారు 500కు పైగా సిలిండర్లతో వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ బుకింగ్ చేసిన 20 రోజుల వరకు గ్యాస్ రాకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పెట్రోల్, డీజిల్ డిమాండ్ కంటే ఎక్కువగా సప్లయ్ చేస్తున్నామని పౌరసరఫరాల కార్పొరేషన్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 4321 పెట్రోల్ బంకులు ఉన్నాయని, సాధారణంగా 5883 కిలో లీటర్ల పెట్రోల్ అవసరమవుతుందని చెప్పారు. బుధవారం ఒక్కరోజే 10,799.5 కిలో లీటర్ల పెట్రోల్ విక్రయాలు జరిగాయన్నారు. ఇది 84 శాతం అధికమని తెలిపారు. అదేవిధంగా సాధారణంగా 13,231 కిలో లీటర్ల డీజిల్ అవసరమని, బుధవారం 22,127 కిలో లీటర్లు విక్రయించామని వెల్లడించారు. రాష్ట్రంలో 2173 డీజిల్ ట్యాంకర్లు, 1056 పెట్రోల్ ట్యాంకర్లు ఉన్నాయని చెప్పారు.
ఎల్పీజీ డొమెస్టిక్ కనెక్షన్లు 1.28 కోట్లు ఉన్నాయని, కమర్షియల్ కనెక్షన్లు 63,550 ఉన్నాయని తెలిపారు. డిమాండ్ కంటే అధికంగానే సప్లయ్ చేస్తున్నామని వివరించారు. ఇక పైప్ న్యాచురల్ గ్యాస్‌లో కూడా 1,03,275 కనెక్షన్లు ఉన్నాయని, రాష్ట్రంలో 225 సీఎన్‌జీ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. సప్లయ్ చైన్‌లో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





