త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Vivek | జర్మన్ భాష, ఏఐ నైపుణ్యాలతో యువతకు విదేశాల్లో అవకాశాలు: మంత్రి వివేక్

Minister Vivek | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్ (Minister Vivek) అన్నారు. టామ్‌కామ్‌ను (TOMCOM) మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న‌దని చెప్పారు.

G

Telangana | Published On May 20, 2026, 1.01 pm IST

Minister Vivek | జర్మన్ భాష, ఏఐ నైపుణ్యాలతో యువతకు విదేశాల్లో అవకాశాలు: మంత్రి వివేక్
Advertisement

Minister Vivek | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్ (Minister Vivek) అన్నారు. టామ్‌కామ్‌ను (TOMCOM) మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న‌దని, దీనికోసం బడ్జెట్‌లో రూ.90 కోట్లు కేటాయించింద‌ని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడలో భారత్–యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. టామ్‌కామ్ ఒక అద్భుతమైన సంస్థగా ఎదిగిందన్నారు. టామ్‌కామ్ ద్వారా శిక్షణ పొందిన యువత విదేశాల్లో మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా జర్మన్ భాష నేర్చుకున్న వారికి యూరోపియన్ దేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ఏఐ కీల‌క‌పాత్ర‌..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోందని, ఏఐతో పోటీ పడగల నైపుణ్యాలను యువత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ తీసుకుంటేనే ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవ‌చ్చ‌ని చెప్పారు. ఈ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ ద్వారా యూరోప్ దేశాల్లో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి అవకాశాలపై తెలంగాణ యువతకు స్పష్టమైన అవగాహన కలుగుతుందని వెల్ల‌డించారు. రాష్ట్ర‌ ప్రభుత్వం గ్లోబల్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్కిల్ మొబిలిటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న‌ద‌ని తెలిపారు.

డిమాండ్‌కు అనుగుణంగా..

జర్మనీ సహా పలు యూరోపియన్ దేశాల్లో పెరుగుతున్న నైపుణ్యాల డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర యువతను సిద్ధం చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. భారత్–ఈయూ మధ్య వలసలు, ఉపాధి అవకాశాలపై జరిగిన చర్చలు యువత భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement