Flipkart | ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే ప్రతి నెలా నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..
Flipkart | ఫ్లిప్‌కార్ట్‌లో తరచూ షాపింగ్ చేసే వినియోగదారులకు శుభవార్త. ఆ సంస్థ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ప్రతి నెలా ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ అందిస్తోంది.
Technology | Published On Aug 1, 2026, 11.44 am IST
Flipkart | ఫ్లిప్‌కార్ట్‌లో తరచూ షాపింగ్ చేసే వినియోగదారులకు శుభవార్త. ఆ సంస్థ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ప్రతి నెలా ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ అందిస్తోంది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే ఒక క్యాలెండర్ నెలలో కనీసం రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన నాలుగు అర్హత కలిగిన ఆర్డర్లను పూర్తి చేయాలి. ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. షాపింగ్‌తోపాటు వినియోగదారులకు అదనపు రివార్డులు అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా షాపింగ్ చేసి అర్హత కలిగిన ఆర్డర్లను పూర్తి చేయవచ్చు. నాలుగో రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన అర్హత కలిగిన ఆర్డర్ పూర్తయిన వెంటనే, అదనపు చెల్లింపులు లేకుండానే ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా 30 రోజుల నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ అందుబాటులోకి వస్తుంది.
నెలకు రూ.299 కన్నా ఎక్కువగా..
అయితే ఈ ప్రయోజనం ఒక్కసారి మాత్రమే లభించదు. ప్రతి నెలా ఉచిత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ పొందాలంటే అదే నెలలో మళ్లీ రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన నాలుగు అర్హత కలిగిన ఆర్డర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఈ రివార్డును ప్రతి నెలా కొత్తగా సంపాదించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు కాని వినియోగదారులు కూడా ఎలాంటి అదనపు రుసుము లేకుండానే ఈ లాయల్టీ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. ఇందుకోసం 12 నెలల వ్యవధిలో 15 ఆర్డర్లను పూర్తి చేయాలి. ఆ తర్వాత వారు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ రివార్డులతోపాటు ఈ ప్రత్యేక నెట్‌ఫ్లిక్స్ ఆఫర్‌కు కూడా అర్హులవుతారు. ఫ్లిప్‌కార్ట్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో ఒక ఈ-కామర్స్ సంస్థతో నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ సేవలను వినియోగించాలంటే ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం లేదా టెలికాం కంపెనీలు, ఇతర సేవలతో కలిసి ఇచ్చే బండిల్ ఆఫర్లను వినియోగించాల్సి వచ్చేది. ఇప్పుడు తొలిసారిగా రోజువారీ ఆన్‌లైన్ షాపింగ్ ద్వారానే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ పొందే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది.
వినోదాన్ని అందించే షాపింగ్..
ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో), సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్స్) రవి అయ్యర్ మాట్లాడుతూ ప్రస్తుతం పెద్ద సంఖ్యలో వినియోగదారులు గ్రోసరీ, రోజువారీ అవసరాల వస్తువులు, క్విక్ కామర్స్ సేవల ద్వారా నిరంతరం షాపింగ్ చేస్తున్నారని తెలిపారు. అలాంటి రెగ్యులర్ కొనుగోళ్లకే అదనపు ప్రయోజనాలు అందించాలని కంపెనీ లక్ష్యంగా నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే చాలామంది వినియోగదారులు నెలకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్లు ఇస్తున్నారని, ఇకపై అదే కొనుగోళ్లకు అదనపు ఖర్చు లేకుండానే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ కూడా పొందవచ్చని వివరించారు. దీంతో రోజువారీ షాపింగ్ వినోదానికి కూడా మార్గంగా మారుతుందని అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Flipkart | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026.. అక్టోబర్ 9 నుంచి భారీ సేల్..
సెప్టెంబర్ 16, 2026

E-commerce Rules | ఆన్‌లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్.. తప్పుదోవ పట్టించే డిస్కౌంట్లకు చెక్..
సెప్టెంబర్ 14, 2026

OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ – ఫస్ట్ నైట్ రోజే ప్రియుడితో పెళ్లికూతురు జంప్
సెప్టెంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం
- ●Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!
- ●Anant Nag | అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం
- ●BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు

Operation Polo | విలీనం.. 78 ఏళ్లు

Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్

Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!



