త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manipal Health IPO | ఈ వారంలోనే మ‌ణిపాల్ హెల్త్ ఐపీవో.. 4 శాతం లాభాల‌కు చాన్స్‌..

Manipal Health IPO | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం కుదిరే దిశ‌గా మ‌ళ్లీ సూచ‌న‌లు క‌నిపిస్తుండ‌డంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో భారీ కొనుగోళ్ల ఉత్స‌వాం క‌నిపిస్తోంది. దీనికి తోడు భారీ కంపెనీలు ఐపీవోల‌కు కూడా సిద్ధ‌మ‌వుతుండ‌డం పాజిటివ్ సంకేతాల‌ను ఇస్తోంది. దీంతో పెట్టుబ‌డిదారులు ఐపీవోల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

S

Business | Published On Jul 27, 2026, 5.11 pm IST

Manipal Health IPO | ఈ వారంలోనే మ‌ణిపాల్ హెల్త్ ఐపీవో.. 4 శాతం లాభాల‌కు చాన్స్‌..
Advertisement

Manipal Health IPO | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం కుదిరే దిశ‌గా మ‌ళ్లీ సూచ‌న‌లు క‌నిపిస్తుండ‌డంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో భారీ కొనుగోళ్ల ఉత్స‌వాం క‌నిపిస్తోంది. దీనికి తోడు భారీ కంపెనీలు ఐపీవోల‌కు కూడా సిద్ధ‌మ‌వుతుండ‌డం పాజిటివ్ సంకేతాల‌ను ఇస్తోంది. దీంతో పెట్టుబ‌డిదారులు ఐపీవోల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం అందుబాటులోకి రానున్న ఐపీవోల్లో మ‌ణిపాల్ హెల్త్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ కూడా ఒక‌టి. మ‌ణిపాల్ గ్రూప్‌కి చెందిన ఈ ఐపీవోను జూలై 29న స‌బ్‌స్క్రిప్ష‌న్ కోసం ఓపెన్ చేయ‌నున్నారు. దేశ‌వ్యాప్తంగా మ‌ల్టీ స్పెషాలిటీ హాస్పిట‌ల్స్‌తోపాటు క్లినిక్స్‌, డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ల‌ను క‌లిగి ఉన్న మ‌ణిపాల్ గ్రూప్‌కు చెంఎదిన ఈ సంస్థ ఐపీవో కోసం పెట్టుబ‌డిదారులు ఆస‌క్తి చూపిస్తుండ‌గా, ఈ వారంలోనే ఐపీవో ఓపెన్ కానుంది. జూలై 31 వ‌ర‌కు పెట్టుబ‌డిదారుల‌కు అవ‌కాశం క‌ల్పించారు.

రూ.9,275 కోట్ల స‌మీక‌ర‌ణ‌..

ఈ ఐపీవో ద్వారా కంపెనీ మొత్తం రూ.9,275.22 కోట్ల‌ను స‌మీకరించాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుంది. ఇందులో భాగంగానే ఐపీవో ధ‌ర శ్రేణిని రూ.560 నుంచి రూ.590 మ‌ధ్య నిర్ణ‌యించింది. ఐపీవోలో పాల్గొనాల‌నుకునే పెట్టుబ‌డిదారులు క‌నీసం 25 షేర్ల‌ను ఒక లాట్ రూపంలో కొనాలి. అంటే రూ.14,750 క‌నీస పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంద‌న్న‌మాట‌. ఆగ‌స్టు 5న బీఎస్ఈ, ఎన్ఎస్ఈల‌లో ఈ షేర్ లిస్ట్ కానుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ తాజా ఇష్యూ కింద రూ.2 ముఖ విలువ క‌లిగిన మొత్తం 13.55 కోట్ల‌కు పైగా షేర్ల‌ను విక్ర‌యించ‌నుంది. వీటి ద్వారా రూ.8వేల కోట్ల‌ను సమీక‌రించాల‌ని చూస్తోంది. అలాగే ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ కింద రూ.2 ముఖ విలువ క‌లిగిన మొత్తం 2.16 కోట్ల‌కు పైగా షేర్ల‌ను విక్ర‌యించి మ‌రో రూ.1275 కోట్ల‌ను జ‌మ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఈ ఐపీవో ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని కంపెనీ లోన్ల చెల్లింపులు, కార్పొరేట్ అవ‌స‌రాలు, కంపెనీ అనుబంధ సంస్థ స‌హ్యాద్రి హాస్పిట‌ల్స్‌లో పెట్టుబ‌డుల కోసం ఉప‌యోగించ‌నున్న‌ట్లు తెలిపింది.

ముఖ్య‌మైన తేదీలు..

మ‌ణిపాల్ హెల్త్ ఎంట‌ర్ ప్రైజెస్ లిమిటెడ్ ఐపీవోకు కెఫిన్ టెక్నాల‌జీస్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ఈ ఐపీవోకి కోట‌క్ మ‌హీంద్రా క్యాపిట‌ల్ కంపెనీ లిమిటెడ్ బుక్ ర‌న్నింగ్ లీడ్ మేనేజ‌ర్‌గా ఉంది. ఈ ఐపీవోలో క్యూఐబీల‌కు 75 శాతం వాటాను కేటాయించ‌గా, రిటెయిల్ ఇన్వెస్ట‌ర్ల‌కు 10 శాతం, ఎన్ఐఐల‌కు 15 శాతం వాటాల‌ను కంపెనీ కేటాయించింది. ఈ ఐపీవోకు గాను ఆగ‌స్టు 3న షేర్ల‌ను అలాట్ చేయ‌నున్నారు. ఆగ‌స్టు 4న షేర్లు పొందిన ఖాతాదారుల డీమ్యాట్ అకౌంట్ల‌లో క‌నిపిస్తాయి. ఆగ‌స్టు 5న ఎక్స్‌ఛేంజ్‌ల‌లో షేర్ లిస్టింగ్ అవుతుంది. ఇక ఈ ఐపీవోకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ.25 ఉండ‌గా, ఆరంభ లిస్టింగ్ స‌మ‌యంలో క‌నీసం 4 శాతం లాభాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే స్టాక్ మార్కెట్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టే ముందు నిపుణుల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement