Tesla | ఢిల్లీలో టెస్లా తొలి ఇన్‌మాల్ ఈవీ చార్జింగ్ కేంద్రం ప్రారంభం..!
Tesla | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత్‌లో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర భారతంలో తొలి ఇన్‌మాల్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ కేంద్రాన్ని సోమవారం ఢిల్లీలో ప్రారంభించింది. నగరంలోని నెక్సస్ సెలెక్ట్ సిటీ వాక్ (Nexus Select CityWalk) మాల్‌లో ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Technology | Published On Jul 6, 2026, 3.07 pm IST
Tesla | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత్‌లో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర భారతంలో తొలి ఇన్‌మాల్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ కేంద్రాన్ని సోమవారం ఢిల్లీలో ప్రారంభించింది. నగరంలోని నెక్సస్ సెలెక్ట్ సిటీ వాక్ (Nexus Select CityWalk) మాల్‌లో ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. మాల్‌లోని పీ-1 పార్కింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఆరు డెస్టినేషన్ ఛార్జర్లు (ఏసీ 11 కిలోవాట్లు) ఏర్పాటు చేశారు. దీంతో టెస్లా వాహనదారులు షాపింగ్ చేయడం, రెస్టారెంట్‌లో సమయం గడుపుతూనే తమ వాహనాలను సులభంగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఛార్జింగ్ కేంద్రం 99.95 శాతం అందుబాటు (అప్‌టైమ్)తో పనిచేసేలా రూపొందించినట్లు టెస్లా వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఆరు ఛార్జింగ్ కేంద్రాలు
కొత్త కేంద్రం ప్రారంభంతో భారత్‌లో టెస్లా నిర్వహిస్తున్న ఛార్జింగ్ కేంద్రాల సంఖ్య ఆరుకు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కంపెనీకి 20 సూపర్‌ఛార్జర్లు, 20 డెస్టినేషన్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. ఛార్జింగ్ కేంద్రంతో పాటు సోమవారం నుంచి ఈ నెల 10 వరకు ప్రత్యేక పాప్ అప్ స్టోర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో టెస్లా తాజాగా విడుదల చేసిన మోడల్ వై ఎల్ (Model Y L) 2026 మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ (Model Y Premium Rear-Wheel Drive) వాహనాలను సందర్శకులు ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కల్పించింది. నిపుణుల మార్గదర్శకత్వంలో వాహనాల ఫీచర్లు, ప్రత్యక్ష ప్రదర్శన, టెస్ట్ డ్రైవ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
మోడల్ వై ఎల్ ప్రత్యేకతలు..
మోడల్ వై ఎల్ ఆరు సీట్లతో, మూడు వరుసల సీటింగ్ సౌకర్యం కలిగిన ఆల్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 681 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5 సెకన్లలో అందుకుంటుంది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.61.99 లక్షలు. అలాగే, ఐదుగురు ప్రయాణికులకు అనువైన 2026 మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ వాహనం 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది. దీని ప్రారంభ ధర రూ.50.89 లక్షలుగా నిర్ణయించారు. ఈ రెండు మోడల్స్‌కు అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA), ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ (IIHS), యూరో ఎన్‌సీఏపీ (Euro NCAP), ఆన్‌క్యాప్ (ANCAP), సీ-ఐఏఎస్‌ఐ (C-IASI) వంటి అంతర్జాతీయ భద్రతా సంస్థల నుంచి అత్యున్నత భద్రతా రేటింగ్స్ లభించినట్లు టెస్లా వెల్లడించింది. ఈ రెండు ఎలక్ట్రిక్ వాహనాల బుకింగ్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రారంభమైనట్లు తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హోమ్ ఛార్జింగ్ సదుపాయం సైతం అందుబాటులో ఉంటుందని టెస్లా చెప్పింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Grace Antony | వాటే ట్రాన్స్ఫర్మేషన్ - బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మగా మారిన మలయాళ బ్యూటీ!
- ●Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజన్‌రెడ్డి
- ●Apple | మళ్లీ కార్డ్ పేమెంట్స్.. యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్..
- ●N. Ramchander Rao | కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాటకాలు వేస్తున్నాయి: రాంచందర్‌రావు
- ●Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి
- ●Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ

Grace Antony | వాటే ట్రాన్స్ఫర్మేషన్ - బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మగా మారిన మలయాళ బ్యూటీ!

Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజన్‌రెడ్డి

Apple | మళ్లీ కార్డ్ పేమెంట్స్.. యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్..

N. Ramchander Rao | కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాటకాలు వేస్తున్నాయి: రాంచందర్‌రావు






