Vaishnavi Chaitanya | బోనమెత్తిన బేబీ హీరోయిన్ – ఉజ్జయినీ మహాంకాళి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య బోనమెత్తింది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాంకాళి బోనాలు ఆదివారం మొదలయ్యాయి. ఈ వేడుకలో వైష్ణవి చైతన్య పాల్గొన్నది. బోనంతో మహాంకాళి అమ్మవారిని దర్శించుకుంది. వైష్ణవి చైతన్య బోనమెత్తిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Aug 2, 2026, 4.32 pm IST
Vaishnavi Chaitanya | బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య బోనమెత్తింది. సికింద్రబాద్‌లోని ఉజ్జయినీ మహాంకాళి బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ బోనాల వేడుకలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య పాల్గొన్నది. బోనం ఎత్తుకొని మహాంకాళి అమ్మవారిని దర్శించుకుంది. కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. పట్టు చీరలో మెడలో నగలు ధరించి ట్రెడిషనల్ లుక్‌లో వైష్ణవిచైతన్య బోనం ఎత్తుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. .
బేబీ మూవీతో...
సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ అయిన వైష్ణవి చైతన్య బేబీ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతకంటే ముందు రంగ్ దే, అల వైకుంఠపురములో, టచ్ చేసి చూడుతో పాటు మరికొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. బేబీ వైష్ణవి చైతన్య కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రేమ పేరుతో ఇద్దరు అబ్బాయిల జీవితాలతో ఆడుకునే యువతిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో అసమాన నటనను కనబరించింది.
వంద కోట్ల వసూళ్లు...
కేవలం పది కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా రూపొందిన బేబీ 100 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. బేబీ బ్లాక్‌బస్టర్ కావడంతో వైష్ణవి చైతన్యకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. లవ్ మీ, జాక్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కథల ఎంపికలో పొరపాట్ల కారణంగా ఈ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
ఎపిక్‌లో...
ప్రస్తుతం ఎపిక్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో బోల్డ్ రోల్‌లో వైష్ణవి చైతన్య కనిపించబోతుంది. ఆర్య హీరోగా నటిస్తోన్న మూవీతో ఈ ఏడాది కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది వైష్ణవి చైతన్య.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!






