Religious clashes in Nepal | నేపాల్‌లో మత ఘర్షణలు.. ముగ్గురు మృతి
Religious clashes in Nepal | భారత్ పొరుగు రాష్ట్రమైన నేపాల్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భారత్ సరిహద్దు సమీపంలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఇవి మన దేశంలోకి వ్యాపించకుండా కేంద్రప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది.
International | Published On Aug 2, 2026, 5.08 pm IST
- భారత్‌లోకి వ్యాపించకుండా చర్యలు
Religious clashes in Nepal | త్రినేత్ర.న్యూస్: భారత్ పొరుగు రాష్ట్రమైన నేపాల్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భారత్ సరిహద్దు సమీపంలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఇవి మన దేశంలోకి వ్యాపించకుండా కేంద్రప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. ఆగ్నేయ నేపాల్‌లో గత కొన్ని రోజులుగా మత ఘర్షణలు కొనసాగుతున్నాయి. మన దేశ సరిహద్దుకు ఆనుకుని ఉన్న సున్‌సారి జిల్లాలో హిందూ మత కార్యక్రమం సందర్భంగా సంగీతం, మతపరమైన జెండాల ఏర్పాటు అంశంలో వివాదం తలెత్తి, ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
ఘర్షణలు మరింత విస్తరించకుండా ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలు శాంతి, సామరస్యాన్ని పాటించాలని నేపాల్ ప్రధాని బలేంద్ర షా విజ్ఞప్తి చేశారు. ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి, నిందితులకు కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మత ఘర్షణల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. బీహార్ రాష్ట్రం మధుబని జిల్లాలోని భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి ఘటనలు సంభవించకుండా పోలీసులను భారీగా మోహరించారు.
తాజావార్తలు
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్లో నయనతార రెండు సినిమాలు రిలీజ్

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్





