త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGMA | హర్మూజ్‌ గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దు.. షిప్పింగ్ కంపెనీల‌కు కేంద్రం ఆదేశాలు

DGMA | షిప్పింగ్ కంపెనీలకు (ship owners) కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క ఆదేశాలు జారీ చేసింది. హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను (seafarers) నియమించవద్దని సూచించింది.

D

National | Published On Jul 16, 2026, 3.31 pm IST

DGMA | హర్మూజ్‌ గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దు.. షిప్పింగ్ కంపెనీల‌కు కేంద్రం ఆదేశాలు
Advertisement

DGMA | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌తలు తీవ్ర‌మ‌వుతున్న వేళ షిప్పింగ్ కంపెనీలకు (ship owners) కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క ఆదేశాలు జారీ చేసింది. హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను (seafarers) నియమించవద్దని సూచించింది. ఈ మేర‌కు ఓడల యజమానులు, షిప్ మేనేజర్లు, రిక్రూట్‌మెంట్ అండ్ ప్లేస్‌మెంట్ సర్వీస్ లైసెన్స్ (RPSL) కంపెనీలకు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్టేష‌న్ (DGMA) కీల‌క అడ్వైజ‌రీ జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వ‌చ్చేంతవరకు ఈ ఆదేశాలను అమలు చేయాలని స్ప‌ష్టం చేసింది.

గ‌ల్ఫ్ ప్రాంతంలో క్షీణిస్తున్న భ‌ద్ర‌తా ప‌రిస్థితుల దృష్ట్యా భారతీయ నావికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీఎంఏ (DGMA) తెలిపింది. అదేవిధంగా ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్‌, హ‌ర్మూజ్ జ‌ల‌సంధితోపాటూ ప‌రిస‌ర ప్రాంత జ‌లాల్లో నిఘాను పెంచాల‌ని షిప్పింగ్ కంపెనీలను కోరింది. నావిగేషనల్ హెచ్చరికలు, భద్రతాసలహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఐఎస్​పీఎస్​ కోడ్‌ను కఠినంగా అమలు చేయాలని సూచించింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్-ఇండియన్ ఓషన్ రీజియన్ (IFC-IOR), DG కమ్యూనికేషన్ సెంటర్‌ల‌ను సంప్ర‌దించాల‌ని సూచించింది. గ‌ల్ఫ్ ప్రాంతంలో మారుతున్న భ‌ద్ర‌తా ప‌రిస్థితుల‌ను తాము నిశితంగా గ‌మ‌నిస్తున్నామ‌ని తెలిపింది. భార‌తీయ నావికుల భ‌ద్ర‌త‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read..

9వ త‌ర‌గ‌తిలో మూడో భాష వ‌ద్దు : సుప్రీంకోర్టు

8000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీతో వ‌చ్చిన రియ‌ల్‌మి సి100ఎక్స్ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర త‌క్కువే..

ఇక పాలాభిషేకాలు, జలాభిషేకాలు నిషేధం.. జేసీబీలతో దండలు వేయొద్దు..

Advertisement
Advertisement