commercial shipping | వాణిజ్య నౌకలపై దాడులను తక్షణమే ఆపండి.. ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు
commercial shipping | హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై (commercial shipping) దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. వీటిని నావికులపై జరిగిన హింసాత్మక చర్యలుగా అభివర్ణించింది.
commercial shipping | త్రినేత్ర.న్యూస్ : హర్మూజ్ జలసంధిలో యూఏఈ (UAE) కి చెందిన చమురు ట్యాంకర్ల (Oil tankers) పై ఇరాన్ జరిపిన దాడిలో ఓ భారతీయ నావికుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) తీవ్రంగా స్పందించింది. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయ (Iran Embassy) డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహ్మద్ జావెద్ హుస్సేనీ (Mohamd Javed Husseni)ని విదేశాంగ శాఖ పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీచేసింది.
హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై (commercial shipping) దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. వీటిని నావికులపై జరిగిన హింసాత్మక చర్యలుగా అభివర్ణించింది. జలసంధిలో వరుస దాడులు నౌకల సురక్షిత ప్రయాణానికి ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హర్మూజ్‌లో స్వేచ్ఛాయుత, అంతరాయం లేని నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు ఆగిపోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. యుద్ధం ముగింపుకు అమెరికాతో చర్చలు కొనసాగించాలని టెహ్రాన్‌కు సూచించింది.
భారత నావికుడి మృతి
హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో రవాణా నౌకలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. ఒమన్ తీరం సమీపంలో రెండు యూఏఈ ట్యాంకర్ల (UAE Tankers)పై ఐఆర్‌జీసీ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయ సిబ్బంది (Indian sailor) మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు భారతీయులు కాగా, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు ఉన్నట్లు యూఏఈ రక్షణశాఖ ప్రకటించింది.
మొంబాసా, అల్ బహియా అనే రెండు జాతీయ చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసినట్లు యూఏఈ రక్షణశాఖ తెలిపింది. ఈ దాడి కారణంగా రెండు ట్యాంకర్లలోనూ భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో నౌకలకు తీవ్రమైన నష్టం వాటిల్లినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ దాడి ఘటనను యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.
సంబంధిత వార్తలు

Donald Trump | ఇరాన్ పని అయిపోయింది.. మొజ్తబా ఖమేనీ 90 శాతం చనిపోయినట్లే : డొనాల్డ్ ట్రంప్
జులై 14, 2026

Strait of Hormuz | హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి
జులై 14, 2026

Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్
జులై 8, 2026
తాజావార్తలు
- ●SIR | తెలంగాణలో 'సర్' గడువు పొడిగించండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
- ●Private Schools | అడ్డగోలుగా వసూలు చేసిన అధిక ఫీజులను తిరిగి ఇచ్చేయండి.. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
- ●Bharat Future City | భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్.. 15న సీఎం రేవంత్ శంకుస్థాపన
- ●Manideep Reddy Missing | ఫిన్లాండ్లో దొరికిన మృతదేహం మనిదీప్దేనా? డీఎన్ఏ టెస్ట్ చేయాలంటూ జైశంకర్‌కు దత్తాత్రేయ లేఖ!
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●Telangana | మనువరాలితో కారు డ్రైవింగ్.. ఎస్ఐకి షాకిచ్చిన రవాణా శాఖ

SIR | తెలంగాణలో 'సర్' గడువు పొడిగించండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి

Private Schools | అడ్డగోలుగా వసూలు చేసిన అధిక ఫీజులను తిరిగి ఇచ్చేయండి.. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

Bharat Future City | భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్.. 15న సీఎం రేవంత్ శంకుస్థాపన

Manideep Reddy Missing | ఫిన్లాండ్లో దొరికిన మృతదేహం మనిదీప్దేనా? డీఎన్ఏ టెస్ట్ చేయాలంటూ జైశంకర్‌కు దత్తాత్రేయ లేఖ!



