Jeevan Reddy | జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. హస్తం పార్టీ నేతలు ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. హస్తం పార్టీ నేతలు ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు మంత్రులు జీవన్ రెడ్డితో పలుమార్లు భేటీ అవ్వగా.. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) రంగంలోకి దిగారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో కలిసి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో కలిసి ఇవాళ ఉదయం జగిత్యాల పట్టణంలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్ ఆయనతో చర్చలు జరుపుతున్నారు. అంతకు ముందు తన నివాసానికి వచ్చిన నేతలకు జీవన్ రెడ్డి ఎదురెళ్లి మరీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేతలు జీవన్ రెడ్డితో తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. పార్టీ వీడకుండా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై జీవన్ రెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అదే రోజు కార్యకర్తలతో సమావేశమై తదుపరి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు. "నాకు జరిగిన అన్యాయంలో సీఎం రేవంత్ రెడ్డికి భాగం ఉంది. పార్టీ ఫిరాయింపుల వల్ల రాహుల్ గాంధీ ఆశయాలకు విఘాతం కలుగుతుంది. రాహుల్ కంటే రేవంత్ రెడ్డి పార్టీకి ఎక్కువయ్యాడు. గత 20 నెలలుగా పార్టీలో మానసిక క్షోభకు గురవుతున్నాను. అవమానాలకు గురవుతూ పార్టీలో కొనసాగలేని పరిస్థితి. అందరి సలహాలు, సూచనలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను. నా రాజకీయ ప్రస్థానంలో మీ తోడు, మార్గదర్శనం కావాలి. ఏది ఏమైనా ప్రజల్లోనే ఉంటాను. ప్రజలకు ఎక్కువగా ఏ పార్టీ లాభం చేస్తుందనుకుంటుందో దాని వెంటే నా ప్రయాణం సాగుతుంది" అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read..
రూ.2.90 లక్షల గ్రాఫిక్ కార్డును ఆర్డర్ చేస్తే.. కిలోన్నర డిటర్జెంట్ పౌడర్ వచ్చింది..
పాతబస్తీలో ఉద్రిక్తత.. వేట కొడవలితో యువకుడి హల్చల్
శ్రీరామనవమి శోభాయాత్ర.. 3000 మంది పోలీసులతో భద్రత.. డ్రోన్లతో పర్యవేక్షణ
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?






