Ration Card e-KYC | మరో నెల రోజులు.. రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు పెంపు
Ration Card e-KYC | రేషన్ కార్డుదారులకు (Ration Card) రాష్ట్ర ప్రభుత్వం ఊరటకల్పించింది. రేషన్ కార్డు ఈ-కేవైసీ (Ration Card e-KYC) గడువును (Deadline) మరో నెలరోజులపాటు పొడిగించింది.
Ration Card e-KYC | త్రినేత్ర.న్యూస్: రేషన్ కార్డుదారులకు (Ration Card) రాష్ట్ర ప్రభుత్వం ఊరటకల్పించింది. రేషన్ కార్డు ఈ-కేవైసీ (Ration Card e-KYC) గడువును (Deadline) మరో నెలరోజులపాటు పొడిగించింది. రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండటం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతుండటంతో రేషన్ ఈ-కేవైసీ (e-KYC) చేసుకోవడానికి ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి తెలిపారు. గడువు పెంపుపై జిల్లా పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులకు సమాచారం అందించామని వెల్లడించారు. ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
మరోవైపు ఆగస్టు 1 నుంచి 31 వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల మొత్తం రేషన్ దుకాణాలు తెరచే ఉండనున్నాయి. కాగా, షెడ్యూల్ ప్రకారం రేషన్ ఈ-కేవైసీ గడువు శుక్రవారంతో ముగియనుంది.
ఇంకా పూర్తిచేయని 30 శాతం మంది..
ఇప్పటివరకు 70 శాతం మంది లబ్దిదారులు మాత్రమే ఈ-కేవైసీ పూర్తిచేశారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య ఒక కోటి 6 వేలు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య 3,42,50,110 వరకు ఉన్నారు. హైదరాబాద్‌లో (Hyderabad) అధిక శాతం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన కుటుంబాలు, వలస కూలీలు ఉంటున్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. కేవలం 10 సెకన్లలో పూర్తయ్యే ఈ-కేవైసీ చేయించుకోకపోతే రేషన్ నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
- ●Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం
- ●Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్
- ●Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!
- ●TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం
- ●One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!

Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం

Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్

Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!

TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం






