త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి పాత్ర చిరస్మరణీయం: కేటీఆర్‌

KTR | తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే, నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మరణం త‌న‌ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.

G

Telangana | Published On Jul 31, 2026, 9.06 am IST

KTR | తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి పాత్ర చిరస్మరణీయం: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే, నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మరణం త‌న‌ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురుచూశాం. కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరమని చెప్పారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమ‌ని తెలిపారు.

ఉద్యమ ఆశయాలను నమ్మి, జీవితాంతం ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయ‌న‌ మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి (BRS) మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటని చెప్పారు. ఆయన చూపిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.

Advertisement
Advertisement