త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్‌

Mahesh Kumar Goud | తెలంగాణ ఉద్యమ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

G

Telangana | Published On Jul 31, 2026, 8.33 am IST

Mahesh Kumar Goud | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్‌
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఉద్యమ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడి మరణం ఈ సమాజానికి తీరని లోట‌ని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ విషాద‌ సమయంలో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఆయన

3 గంట‌ల‌కు అంత్య‌క్రియ‌లు

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి అంత్య‌క్రియ‌లు ఆయ‌న స్వ‌గ్రామం న‌ల్ల‌బెల్లిలో మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు జ‌రుగ‌నున్నాయి. పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి గ‌త ఆదివారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే. దీంతో గ‌త ఐదురోల‌జులుగా సికింద్రాబాద్ య‌శోద ద‌వాఖానాలో చికిత్స పొందుతున్న ఆయ‌న గురువారం అర్ధ‌రాత్రి 12.51 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయ‌న మృత‌దేహాన్ని తొలుత హనుమకొండకు తరలించారు. అనంతరం అక్క‌డి నుంచి మాజీ ఎమ్మెల్యే భౌతికకాయం నర్సంపేటకు తీసుకువెళ్లారు. నర్సంపేట మీదుగా నల్లబెల్లికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం పెద్ది సుదర్శన్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement
Advertisement