Graphic Card | రూ.2.90 లక్షల గ్రాఫిక్ కార్డును ఆర్డర్ చేస్తే.. కిలోన్నర డిటర్జెంట్ పౌడర్ వచ్చింది..
Graphic Card | ఇటీవలి కాలంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అనేక మోసాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా వరకు మోసాలు తప్పుడు వస్తువులను అందించేవే జరుగుతున్నాయి. వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేరే వస్తువులను, అందులోనూ చాలా తక్కువ ఖరీదు ఉన్న రోజువారి వినియోగించే కిరాణా సరుకులు లేదా సబ్బులు వంటి వాటిని ప్యాక్‌లలో పెట్టి మోసం చేస్తున్నారు.
Graphic Card | ఇటీవలి కాలంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అనేక మోసాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా వరకు మోసాలు తప్పుడు వస్తువులను అందించేవే జరుగుతున్నాయి. వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేరే వస్తువులను, అందులోనూ చాలా తక్కువ ఖరీదు ఉన్న రోజువారి వినియోగించే కిరాణా సరుకులు లేదా సబ్బులు వంటి వాటిని ప్యాక్‌లలో పెట్టి మోసం చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తికి కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఆన్‌లైన్‌లో రూ.2.90 లక్షల విలువైన హై ఎండ్ గ్రాఫిక్ కార్డును అతను ఆర్డర్ చేయగా, డిటర్జెంట్ ప్యాకెట్ అందులో వచ్చింది. డెలివరీ అనంతరం అతను ప్యాక్‌ను గమనించగా సీల్‌ను తొలగించి మళ్లీ టేప్ వేసి అతికించినట్లు స్పష్టంగా కనిపించిందని, అలాగే నకిలీ ఆఫ్టర్ మార్కెట్ బార్‌కోడ్‌ను కూడా అతికించారని అతను ఆరోపించాడు. ఈ మేరకు అతను తన సోషల్ ఖాతా ఎక్స్‌లో పోస్టు పెట్టగా అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అమెజాన్ పట్టించుకోవడం లేదు..
స్వగత్ నాయక్ అనే వ్యక్తి అమెజాన్‌లో రూ.2.90 లక్షల విలువైన గిగాబైట్ ఆర్టీఎక్స్ 5090 హైఎండ్ గ్రాఫిక్స్ కార్డ్‌ను ఆర్డర్ చేశాడు. కానీ అతనికి ప్యాక్‌లో 1 కిలో ఘడీ డిటర్జెంట్ వచ్చింది. ఈ విషయాన్ని అతను తన ఎక్స్ పోస్టులో తెలిపాడు. ప్యాక్ లో ఉన్న గ్రాఫిక్ కార్డును తీసుకుని అందులో డిటర్జెంట్‌ను పెట్టి ప్యాక్‌ను సీల్ వేశారని, ఆ విషయం స్పష్టంగా తెలుస్తోందని అతను చెప్పాడు. అలాగే ప్యాక్ పై ఉండే అసలు బార్‌కోడ్‌ను తొలగించి నకిలీ కోడ్‌ను ముద్రించారని ఆరోపించాడు. అయితే ఈ విషయాలను అమెజాన్ కస్టమర్ కేర్ టీమ్‌కు తెలిపినా వారు తన సపోర్ట్ టిక్కెట్‌ను కేవలం 15 నిమిషాల్లోనే క్లోజ్ చేశారని, ప్రస్తుతం రీఫండ్ కోసం యత్నిస్తుంటే తన రిక్వెస్ట్‌ను అమెజాన్ పట్టించుకోవడం లేదని తెలిపాడు.
https://twitter.com/autocarrrot/status/2035727188075696291
అమెజాన్ గోడౌన్‌లోనే ఫ్రాడ్ జరిగింది..
అమెజాన్‌లోని ఫుల్‌ఫిల్డ్ బై అమెజాన్ ద్వారా సదరు ఆర్డర్ డెలివరీ వచ్చిందని, అంటే అది అమెజాన్ గోడౌన్‌లో ఉంటుందని, అక్కడి నుంచే డెలివరీ అయిందని అతను తెలిపాడు. అన్‌బాక్సింగ్ సమయంలో తాను వీడియో తీశానని స్పష్టం చేశాడు. షిప్పింగ్ లేబుల్‌లో ప్యాకేజీ బరువు 1.56 కిలోలుగా పేర్కొన్నారని, కానీ రిటెయిల్ ప్యాకింగ్ లో ఆర్‌టీఎక్స్ 5090 సాధారణ బరువు దాదాపుగా 3 కిలోల వరకు ఉంటుందని తెలిపాడు. గణితం అబద్దం చెప్పదని, అమెజాన్ మాత్రం దర్యాప్తు అలా చేస్తుందని ఎద్దేవా చేశాడు. తమ సొంత షిప్పింగ్ లేబుల్‌లో బరువును 1.56 కిలోలుగా ఇచ్చారని అన్నాడు. 1.56 కిలోలు అంటే డిటర్జెంట్ + ప్యాకేజింగ్ బరువే అతుందని, ఇది అమెజాన్ గోడౌన్ స్కానింగ్‌ను ఎలా దాటిందని ప్రశ్నించాడు.
నెటిజన్ల మద్దతు..
అయితే సామాజిక మాధ్యమాల్లో స్వగత్ నాయక్ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. తమకు కూడా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయని పలువురు కామెంట్లు పెట్టారు. అయితే కొందరు మాత్రం స్వగత్ నాయక్‌ను తప్పుబట్టారు. ప్యాక్ సీల్ తీసి మళ్లీ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంటే ప్యాక్‌ను తీసుకోకుండా అప్పుడే వెంటనే రిటర్న్ ఇవ్వాల్సిందని కొందరు అభిప్రాయపడగా, అతను పోస్ట్ చేసిన అన్‌బాక్సింగ్ వీడియోను ఎడిట్ చేసి ఉంటారని, అసలు అతనే ఫ్రాడ్ చేసి ఉంటాడని మరికొందరు కామెంట్లు పెట్టారు. అయితే కొందరు మాత్రం తాము అలాంటి ఖరీదైన వస్తువులను ఆన్ లైన్‌లో ఎన్నటికీ కొనుగోలు చేయబోమని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Amazon | అమెజాన్ భారీ డీల్.. జనరాక్ షేర్లు ఏకంగా 40 శాతం జంప్..
సెప్టెంబర్ 17, 2026

Revanth Reddy | రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టు.. తప్పదోవ పట్టించేలా సీఎం ఫొటో.. వ్యక్తిపై ఎఫ్ఐఆర్
సెప్టెంబర్ 12, 2026

Supreme Court | ఆన్‌లైన్‌లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?



