Old City | పాతబస్తీలో ఉద్రిక్తత.. వేట కొడవలితో యువకుడి హల్చల్
Old City | పాతబస్తీలో నిన్న సాయంత్రం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఓ యువకుడు గంజాయి మత్తులో వేట కొడవలితో హల్చల్ సృష్టించాడు.
Old City | త్రినేత్ర.న్యూస్ : పాతబస్తీలో నిన్న సాయంత్రం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఓ యువకుడు గంజాయి మత్తులో వేట కొడవలితో హల్చల్ సృష్టించాడు. ఈ ఘటన చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో చోటు చేసుకుంది. యువకుడు వేట కొడవలితో దాడి చేసేందుకు యత్నించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో ఉన్న మెటర్నరిటీ ఆస్పత్రి సమీపంలో ఓ వ్యక్తి సెల్‌ఫోన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రెండు నెలల క్రితం కొంత మంది యువకులు ఆ సెల్‌ఫోన్ దుకాణం వద్దకు వచ్చారు. "చచ్చా భాయ్ కే బచ్చే హే హమ్" అంటూ దౌర్జన్యానికి దిగారు. కేవలం రూ. 60 విలువ చేసే స్క్రీన్ గార్డ్ విషయంలో షాపు యజమానితో గొడవకు దిగారు. ఇక అప్పట్నుంచి ప్రతి నెల ఆ దుకాణం వద్దకు చేరుకుని.. నెల మమూలు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నారు. సోమవారం సాయంత్రం మళ్లీ హంగామా సృష్టించాడు యువకుడు ఆర్బాజ్. తన వెంట తెచ్చుకున్న వేట కొడవలితో దాడి చేసేందుకు యత్నించాడు. సెల్‌ఫోన్ దుకాణంలోని సామాన్లను రోడ్డుపైకి తోసేశాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
https://x.com/TeluguScribe/status/2036134357338038491
సంబంధిత వార్తలు

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
సెప్టెంబర్ 23, 2026

Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
సెప్టెంబర్ 22, 2026

CM Revanth Reddy | నీళ్లు నిలిచినా.. వాహనాలు ఆగినా.. మీ ఉద్యోగాలుండవ్..
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?



