త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Sudarshan Reddy | న‌ల్ల‌బెల్లికి పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి భౌతిక‌కాయం.. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అంత్య‌క్రియ‌లు

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ నేత‌, న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి (Peddi Sudarshan Reddy) క‌న్నుమూశారు. గ‌త ఆదివారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న సికింద్రాబాద్ య‌శోద ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ.. గురువారం అర్ధ‌రాత్రి 12.51 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు.

G

Telangana | Published On Jul 31, 2026, 7.10 am IST

Peddi Sudarshan Reddy | న‌ల్ల‌బెల్లికి పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి భౌతిక‌కాయం.. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అంత్య‌క్రియ‌లు
Advertisement

Peddi Sudarshan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ నేత‌, న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి (Peddi Sudarshan Reddy) క‌న్నుమూశారు. గ‌త ఆదివారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న సికింద్రాబాద్ య‌శోద ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ.. గురువారం అర్ధ‌రాత్రి 12.51 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయ‌న భౌతిక‌కాయాన్ని స్వ‌గ్రామం న‌ల్ల‌బెల్లికి త‌ర‌లించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అంతిమ సంస్కారాలు నిర్వ‌హిస్తామ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

కాగా, ఉద‌యం 7 గంట‌ల‌కు పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి భౌతిక‌కాయం న‌ర్సంపేట‌కు చేరుకుంటుద‌ని మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. హ‌నుమ‌కొండ‌లోని అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద నివాళులు అర్పించిన అనంత‌రం న‌ర్సంపేట‌కు వెళ్తార‌న్నారు. భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చే అభిమానులు, ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. తెలంగాణ ఉద్య‌మ‌కారుడికి తుడివీడ్కోలు ప‌లుక‌నున్నామ‌న్నారు.

Advertisement
Advertisement