Hyderabad | శ్రీరామనవమి శోభాయాత్ర.. 3000 మంది పోలీసులతో భద్రత.. డ్రోన్లతో పర్యవేక్షణ
Hyderabad | ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు భద్రతా చర్యలపై నిఘా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు భద్రతా చర్యలపై నిఘా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం సీతారాంబాగ్‌లోని రామాలయం వద్ద సీపీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర అధికారులు భద్రతా చర్యలపై సమీక్షించారు.
శ్రీరామనవమి శోభాయాత్ర సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు 3 వేల మంది పోలీసులతో భద్రత కల్పించాలని నిర్ణయించారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో శోభాయాత్రను పర్యవేక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
27న మధ్యాహ్నం ఒంటి గంటకు సీతారాంబాగ్ వద్ద శోభాయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం వరకు హనుమాన్ వ్యాయామ శాలకు శోభాయాత్ర చేరుకోనుంది. ఈ మార్గంలో రద్దీని నియంత్రించేందుకు పోలీసులు వాహనాలను మళ్లించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
శోభాయాత్రలో ఆకతాయిల ఆగడాలను నివారించేందుకు షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఇక డీజేలను వినియోగించినప్పటికీ తక్కువ డెసిబుల్స్‌లో సౌండ్ ఉండాలని శోభయాత్ర నిర్వాహకులకు పోలీసులు సూచించారు.
తాజావార్తలు
- ●Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం
- ●TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
- ●Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?

Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు






