Driver Jobs | జర్మనీలో డ్రైవర్ ఉద్యోగాలు.. తెలంగాణ వాసులకు గోల్డెన్ చాన్స్..
Driver Jobs | త్రినేత్ర.న్యూస్: డ్రైవింగ్‌పై (Driver Jobs) ఆసక్తి కలిగిన నిరుద్యోగులకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) అదిరిపోయే న్యూస్ అందించింది. జర్మనీలో డ్రైవర్లుగా ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. (Jobs In Germany) ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోచ్చు. ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనుంది. మరిన్ని వివరాలకోసం 94400 51285, 94400 51452 నంబర్లలో సంప్రదించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని TOMCOM అందిస్తున్న ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవచ్దని కోరింది.
అర్హతలు..
అభ్యర్థులు 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 40 సంవత్సరాల లోపు వయస్సు, 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం (ట్రక్ డ్రైవింగ్), హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
జీతం, ప్రయోజనాలు..
నెలకు రూ.2.6 లక్షల నుంచి రూ.3.7 లక్షలు వేతనం లభిస్తుంది. ఉచిత వీసా, విమాన టికెట్. మొదటి 6 నెలలు ఉచిత వసతి కల్పిస్తారు. వారానికి 5 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. రోజుకు 8 నుంచి 9 గంటల డ్యూటీ ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 20 (సోమవారం)
- ఇంటర్వ్యూ ప్రదేశం: TOMCOM కార్యాలయం, మల్లేపల్లి, హైదరాబాద్
ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను (Resume) సిద్ధం చేసుకుని ఈమెయిల్ ఐడీ tomcom.resume@gmail.com కు పంపించాలి. అభ్యర్థులు తమ ఫోన్ నంబర్లు, విద్యార్హత పత్రాలను జత చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారం కోసం, సందేహాల నివృత్తి కోసం 94400 51285, 94400 51452 నంబర్లలో సంప్రదించవచ్చు.
TOMCOM అంటే..
తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ కింద రిజిస్టర్ అయిన జాబ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ టామ్‌కామ్. రాష్ట్రంలో అర్హత, నైపుణ్యం కలిగిన వారికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఇది జర్మనీ, హంగేరి, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, పోలాండ్, బ్రిటన్, గల్ఫ్ దేశాలలో తెలంగాణ వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తుంది.
Also Read..
జర్మనీలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు.. రేపే ఇంటర్వ్యూ
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



