త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MMTS Trains | జూన్‌ 2 నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణం..!

MMTS Trains | రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో ఉచిత ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఇప్ప‌టికే ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న ప్ర‌భుత్వం.. ఎంఎంటీఎస్ రైళ్ల‌లోనూ (MMTS Trains) ఉచిత ప్ర‌యాణం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది.

G

Telangana | Published On Apr 19, 2026, 8.10 am IST

MMTS Trains | జూన్‌ 2 నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణం..!
Advertisement

MMTS Trains | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో ఉచిత ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఇప్ప‌టికే ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న ప్ర‌భుత్వం.. ఎంఎంటీఎస్ రైళ్ల‌లోనూ (MMTS Trains) ఉచిత ప్ర‌యాణం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది. మ‌హిళ‌లు, పురుషులు అనే తేడా లేకుండా అంద‌రికీ దీనిని వ‌ర్తింప‌చేయనుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ‌మైన జూన్ 2 నుంచి దీనిని అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతానికి ప్రయోగాత్మక ప్రాతిపదికన ఏడాది పాటు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అధికార యంత్రాంగం అమలు దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌ నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ రద్దీ, కాలుష్య సమస్యలకు చెక్‌ పెట్టేలా ఈ నిర్ణయం దోహదపడనుంది.

ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ రైళ్ల ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయం సమకూరుతున్న‌ది. అయితే ఉచిత ప్ర‌యాణం వ‌ల్ల పెరిగే ప్ర‌యాణికుల సంఖ్య‌తో సంబంధం లేకుండా, రైల్వేకు వ‌చ్చే ప్రస్తుత ఆదాయాన్ని ఇస్తామని ప్రభుత్వం ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు (SCR)​ ఇప్ప‌టికే లేఖ రాసింది. ఈ నేప‌థ్యంలో ఎంఎంటీఎస్‌ల్లో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఎంవోయూను పంపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్ర‌భుత్వాన్ని కోరారు. ముసాయిదా ఎంవోయూను పరిశీలించి రైల్వేబోర్డు అనుమతి తీసుకుంటామని తెలిపారు. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం స్టేషన్లలో సౌకర్యాలు కల్పిస్తామని, రైళ్ల ఫ్రీక్వెన్సీ, సమయాలను రైల్వే శాఖే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement