త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weather Update | రాష్ట్రంలో 26 వ‌ర‌కు వాన‌లు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌

G

Telangana | Published On Apr 19, 2026, 7.45 am IST

Weather Update | రాష్ట్రంలో 26 వ‌ర‌కు వాన‌లు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌
Advertisement

Weather Update | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో గ‌త కొన్ని రోజులుగా ఎండ‌లు (Weather Update) దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతుండ‌టంతో అధిక వేడి, ఉక్క‌పోత‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల త‌ర్వాత బ‌య‌ట తిర‌గాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఇలాంటి త‌రుణంలో వాతావ‌ర‌ణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ఈనెల 26 వరకు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం, క్యూములోనింబస్‌ మేఘాలతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంద‌ని వెల్ల‌డించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల‌ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది

ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌,పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వాన ప‌డుతుంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల‌కు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

మ‌రోవైపు శనివారం ఆసిఫాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోనే అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త న‌మోద‌యింది. కెరమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీలు రికార్డ‌యింది. ఇక నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద‌య్యాయి.

Read Also

న‌గ‌రంలో వ‌ర్షం.. ఉక్క‌పోత‌కు ఉప‌శ‌మ‌నం..

జర్మనీలో ఉద్యోగాలు.. ల‌క్ష‌ల్లో వేత‌నాలు.. రేపే ఇంట‌ర్వ్యూ

Advertisement
Advertisement