TOMCOM | జర్మనీలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు
TOMCOM | త్రినేత్ర.న్యూస్: విదేశాల్లో ఉద్యోగం చేయాలని ప్రతిఒక్కరికి ఉంటుంది. జర్మనీ (Jobs In Germany)వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగం సంపాదించి బాగా సెటిలవ్వాలని చాలామంది అనుకుంటారు.
TOMCOM | త్రినేత్ర.న్యూస్: విదేశాల్లో ఉద్యోగం చేయాలని ప్రతిఒక్కరికి ఉంటుంది. జర్మనీ (Jobs In Germany)వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగం సంపాదించి బాగా సెటిలవ్వాలని చాలామంది అనుకుంటారు. కానీ భాషా సమస్య, సరైన మార్గదర్శకత్వం, విద్యార్హత లేకపోవడంతో వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికోసం తెలంగాణ ప్రభుత్వ విదేశీ మానవ వనరుల సంస్థ (TOMCOM) అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది. ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ చేసిన వారికోసం జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నది. కమర్షియల్ వెహికల్ టెక్నీషియన్, అగ్రికల్చర్ అండ్ కన్‌స్ట్రక్షన్ మెషినరీ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అందువల్ల ప్రైవేటు ఏజెంట్ల చేతిలో మోసపోకుండా, ప్రభుత్వ పర్యవేక్షణలో సురక్షితంగా విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇది సువర్ణావకాశం.
అర్హతలు మరియు భాషా నైపుణ్యం
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటిఐ (ITI), డిప్లొమా, బీఈ, బీటెక్ (B Tech) పూర్తి చేసి ఉండాలి. సాధారణంగా జర్మనీ వెళ్లాలంటే ‘జర్మన్ భాష’ (German Language) నేర్చుకోవడం తప్పనిసరి. కానీ, ఈ ప్రత్యేక నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులకు కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్‌పై మంచి పట్టు ఉండాలి. ఇంగ్లీష్ భాషలో కనీసం A2 స్థాయి నైపుణ్యం ఉండాలి. B1 స్థాయి అయితే మంచిది. అభ్యర్థులు 21 ఏండ్లు నిండినవారై ఉండాలి.
వేతనం, ప్రయోజనాలు..
నెలకు రూ.3లక్షల వరకు ఉంటుంది. వీసా ఖర్చులు కంపెనీయే భరిస్తుంది. దీనికితోడు ఉచిత ట్రాన్స్‌పోర్ట్, ఓవర్‌టైమ్ అవకాశం కల్పిస్తుంది.
ఉద్యోగ బాధ్యతలు
వాహనాలు, హెవీ మెషినరీ మెయింటెనెన్స్, రిపేర్ చేయాల్సి ఉంటుంది. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ సమస్యలను పరిష్కరించాలి. ట్రక్కులు, కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్‌పై పని చేయాలి. భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 20 (సోమవారం)
- ఇంటర్వ్యూ ప్రదేశం: TOMCOM కార్యాలయం, మల్లేపల్లి, హైదరాబాద్
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటాను (Resume) సిద్ధం చేసుకుని tomcom.resume@gmail.com అనే ఈమెయిల్ ఐడీకి పంపాలి. అభ్యర్థులు తమ ఫోన్ నంబర్లు, విద్యార్హత పత్రాలను జత చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారం కోసం లేదా సందేహాల నివృత్తి కోసం ఈ క్రింది ఫోన్ నంబర్లను పనివేళల్లో సంప్రదించవచ్చు: 94400 51285, 94400 51452.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల ముందే తెలిసుంటే ఐపీఎస్‌లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జులై 8, 2026

Uttam Kumar Reddy | తుమ్మిడిహెట్టి పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జులై 8, 2026

KTR | ఆయిల్ పామ్ రైతులతో ముచ్చటించిన కేటీఆర్.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ..
జులై 7, 2026
తాజావార్తలు
- ●Encounter | 11 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం
- ●Google | గూగుల్ స్టోరేజ్‌ను ఇక యూజర్లు జాగ్రత్తగా వాడాల్సిందే.. ఆండ్రాయిడ్ బ్యాకప్లకూ అదే లిమిట్..
- ●RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల ముందే తెలిసుంటే ఐపీఎస్‌లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Mumbai airport | రన్‌వేపైకి ఎదురెదురుగా వచ్చిన విమానాలు.. ముంబైలో షాకింగ్ ఘటన
- ●Late Devonian | 370 మిలియన్ ఏళ్ల నాటి విపత్తు రహస్యం వీడింది..!
- ●Electric Shocks | తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను మంచానికి కట్టేసి కొట్టి.. కరెంటు షాక్ పెట్టి చిత్రహింసలు..

Encounter | 11 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం

Google | గూగుల్ స్టోరేజ్‌ను ఇక యూజర్లు జాగ్రత్తగా వాడాల్సిందే.. ఆండ్రాయిడ్ బ్యాకప్లకూ అదే లిమిట్..

RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల ముందే తెలిసుంటే ఐపీఎస్‌లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Mumbai airport | రన్‌వేపైకి ఎదురెదురుగా వచ్చిన విమానాలు.. ముంబైలో షాకింగ్ ఘటన



