Ration Kit | త్వరలోనే ప్రజలకు ఇందిరమ్మ అభయహస్తం రేషన్ కిట్
Ration Kit | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో త్వరలోనే మరో భారీ సంక్షేమ పథకాన్ని (Welfare Scheme) అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) సమాయత్తమవుతోంది. రేషన్‌కార్డు (Ration Card) ఉన్న వారికి తొమ్మిది నిత్యావసర సరుకుల (Essential Items) తో కూడిన కిట్ (Ration Kit)ను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది.
కిట్‌లో తొమ్మిది నిత్యావసర సరుకులు
రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ
వచ్చే కేబినెట్ సమావేశంలో తీర్మానం
కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
Ration Kit | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో త్వరలోనే మరో భారీ సంక్షేమ పథకాన్ని (Welfare Scheme) అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) సమాయత్తమవుతోంది. నిరుపేదలు, సామాన్యుల సమగ్రాభివృద్ధి, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. రేషన్‌కార్డు (Ration Card) ఉన్న వారికి తొమ్మిది నిత్యావసర సరుకుల (Essential Items) తో కూడిన కిట్ (Ration Kit)ను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ కిట్‌ను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నారు. అంటే రాష్ట్రంలోని కోటికిపైగా ఉన్న రేషన్ కార్డుల ద్వారా 3.25 కోట్ల ప్రజానీకానికి ప్రయోజనం చేకూరనుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) పేరుతో ఈ పథకానికి ఇందిరమ్మ అభయహస్తం (Indira Gandhi Abhayahastam) రేషన్ కిట్‌గా నామకరణం చేశారు.
నెలనెలా కిట్ పంపిణీ
ప్రతి నెలా అందించే ఈ కిట్‌లో తొమ్మిది ముఖ్యమైన వస్తువులు ఉండనున్నాయి. పప్పులు (కంది పప్పు, శనగ పప్పు), మంచినూనె (పామ్ ఆయిల్), గోధుమ పిండి, చక్కెర, ఉప్పు (అయోడైజ్డ్), చింతపండు, ఎండు మిరపకాయలు, పసుపు, బియ్యం పిండి ఉండనున్నాయి. రేషన్ కార్డులోని సభ్యుల సంఖ్య ఆధారంగా ఈ సరుకుల పరిమాణం ఉండనుంది. సగటున ఒక్కో కిట్ విలువ రూ.అయిదు వందలు ఉన్నా నెలకు అయిదు వందల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
రాష్ట్ర విభజనకు ముందు అమ్మ హస్తం పేరుతో అమలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది నిత్యావసర సరుకులను అందించేందుకు అమ్మ హస్తం పేరుతో నూతన పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి 2013 ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఈ సరుకులను సబ్సిడీ ధరతో రూ.185కే సరఫరా చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఈ పథకాన్ని పక్కకు పెట్టగా, ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది నిత్యావసరాలకు మరికొన్ని చేర్చి, అన్న హస్తంగా పేరుమార్చారు.
మేలోనే ప్రారంభం కావాల్సిన పథకం..
ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మే నెలలో పథకాన్ని అధికారికంగా ప్రారంభించాల్సినప్పటికీ వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా రానున్న కేబినెట్ మీటింగ్‌లో దీనిపై మంత్రివర్గం తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ఈ పథకం అమలైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఊపు రానుంది. ఇప్పటికే పలు పథకాలు ప్రజలకు నేరుగా చేరువయ్యాయి.
పేదలకు జీవన భారాన్ని తగ్గించేందుకే...
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా కిట్ పంపిణీతో పేదలకు కిరాణా సరుకుల ఆర్థిక భారం తగ్గనుంది. ఈ పథకం ద్వారా పేదల జీవన భారాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం. వారి ఆహార భద్రతను నిర్ధారించవచ్చు. ఇటీవల పెరిగిన నూనెలు, పప్పుల ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



