Champion Review | ఛాంపియన్ రివ్యూ – శ్రీకాంత్ కొడుకు సినిమా హిట్టా? ఫట్టా?
రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ మూవీ క్రిస్మస్ కానుకగా గురువారం థియేటర్లలోకి వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రేమకథను జోడించి రూపొందించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Dec 25, 2025, 1.54 pm IST
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ ఛాంపియన్ గురువారం థియేటర్లలో రిలీజైంది. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ పీరియాడికల్ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంకదత్, స్వప్నదత్ నిర్మించారు. మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్ ఛాంపియన్ తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఛాంపియన్ ఎలా ఉంది? రోషన్‌కు హిట్ దక్కిందా? లేదా? అంటే?
మైఖేల్ కల...
మైఖేల్ (రోషన్) ఓ ఫుట్‌బాల్ ప్లేయర్. ఇంగ్లండ్ వెళ్లి సెటిలైపోవాలని కలలు కంటుంటాడు. మైఖేల్ టీమ్‌కు, పోలీస్ టీమ్‌కు మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో అద్భుతంగా ఆడిన మైఖేల్ తన టీమ్‌ను గెలిపిస్తాడు. మైఖేల్ ఆటతీరుకు బ్రిటీష్ రిటైర్డ్ ఆఫీసర్ ఫిదా అవుతాడు. ఇంగ్లండ్ లోని ఓ క్లబ్‌కు ఆడే ఆఫర్ ఇస్తాడు. కానీ మైఖేల్ తండ్రిపై దేశద్రోహి అనే ముద్ర ఉండటం అతడి కలకు అడ్డుగా మారుతోంది. ఇంగ్లండ్ వెళ్లడం కోసం హైదరాబాద్ నుంచి బీదర్‌కు అక్రమంగా ఆయుధాలను సరఫరా చేసే డీల్ ఒప్పుకుంటాడు మైఖేల్. అనుకోకుండా పోలీసులకు దొరికిపోయి భైరాన్‌పల్లిలో తలదాచుకోవాల్సివస్తుంది. ఆ ఊరిలో అడుగుపెట్టిన తర్వాత మైఖేల్ జీవితం ఎలా మారిపోయింది? నిజాంతో పాటు దేశ్‌ముఖ్ సైన్యాన్ని ఎదురించి భైరాన్ పల్లి కోసం మైఖేల్ ఎలా నిలబడ్డాడు? అతడి జీవితంలోకి వచ్చిన చంద్రకళ (అనస్వర రాజన్) ఎవరు? రాజిరెడ్డి (కళ్యాణ చక్రవర్తి) , సుందరయ్య (మురళీ శర్మ) కథే మిటి? ప్రేమతో పాటు భైరాన్ పల్లి కోసం మైఖేల్ తన లక్ష్యాన్ని పక్కనపెట్టాడా? లేదా? అన్నదే ఛాంపియన్ మూవీ కథ.
పీరియాడికల్ ట్రెండ్...
ప్రస్తుతం పీరియాడికల్ కథలపై హీరోలు, దర్శకులు తెగ ఆసక్తిని చూపుతున్నారు. చరిత్రలో మరుగున పడిన కొన్ని ఆసక్తికర సంఘటనలకు ఫిక్షనల్ అంశాలను జోడించి సినిమాలను తెరకెక్కించడం ట్రెండ్‌గా మారింది. ఆర్ఆర్ఆర్ సహా ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఛాంపియన్ కూడా ఆ కోవకు చెందిన సినిమానే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడి కథలు, చారిత్రక నేపథ్యాలతో సినిమాలను రూపొందించే సంస్కృతి పెరిగిపోయింది. తెలంగాణ యాస, భాషలతో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబడుతున్నాయి.
తెలంగాణ సాయుధ పోరాటానికి భైరాన్‌పల్లి సంఘటన ఊపిరిపోసింది. ఖాసీం రజ్వీతో పాటు దేశ్‌ముఖ్‌ల అకృత్యాలను ఎదురించి భైరాన్‌పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామల ప్రజలు ధైర్యంగా పోరాటం చేశారు. భైరాన్‌పల్లి గ్రామ ప్రజలపై ప్రతీకారంతో రగిలిపోయిన ఖాసీం రజ్వీ సేనలు నరమేథం సృష్టించాయి. అర్ధరాత్రి ఊరిపై దాడిచేసి వందలాది అమాయక ప్రజల ప్రాణాలు తీశారు. భైరాన్‌పల్లి ఘటనను ఆధారంగా చేసుకొని ఫిక్షనల్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఛాంపియన్ కథను రాసుకున్నారు. అసలు భైరన్‌పల్లిలో ఏం జరిగింది అన్నది మైఖేల్ పాత్ర ద్వారా యాక్షన్, లవ్‌స్టోరీ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సినిమాలో చూపించారు. ఉన్నది ఉన్నట్లుగా కాకుండా చాలా వరకు డైరెక్టర్ సినిమాటిక్ లిబర్జీని తీసుకున్నారు.
కాన్సెప్ట్, దర్శకుడి ఆలోచన బాగున్నా రెండింటిని మిక్స్ చేయడంలో కాస్తంత తడబడినట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో అసలు చరిత్ర సైడ్ అయిపోయి ఫిక్షనల్ కోసం జోడించిన హీరో పాత్ర హైలైట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
డిఫరెంట్ క్లైమాక్స్...
హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసేందుకు వల్లభాయ్ పటేల్ చేసే ప్రయత్నాలతో ఛాంపియన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఫుట్ బాల్ ప్లేయర్‌గా హీరో పరిచయం, పోలీస్ టీమ్‌తో మ్యాచ్ ఆడి గెలవడం లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. తన లక్ష్యం కోసం అడ్డదారిని ఎంచుకున్న హీరో అనుకోకుండా భైరాన్‌పల్లిలో ఆశ్రయం పొందడం హీరోయిన్‌తో ప్రేమాయణంతో సినిమాను ముందుకు నడిపించారు డైరెక్టర్. లవ్ ట్రాక్ చాలా నాచురల్‌గా సాగుతుంది. రజాకర్ల ఎటాక్‌ను హీరో ఎదురించే యాక్షన్ ఎపిసోడ్ తో సెకండాఫ్‌లోకి ఎంటరయ్యారు.
హీరో తండ్రి ఎవరు? అతడి నేపథ్యమేమిటనే ట్విస్ట్‌ను సెకండాఫ్‌లో రివీల్ చేయడం బాగుంది. ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కు స్వాత్రం త్య్ర పోరాటాన్ని లింక్ చేయడంతో మంచి ఎమోషన్ క్యారీ అయ్యింది. . పతాక ఘట్టాల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఖాశీం రజ్వీ కుట్రలను హీరోతో పాటు భైరాన్‌పల్లి ప్రజలు ఎలా అడ్డుకున్నారన్నది ఇంటెన్స్‌గా అనిపిస్తాయి. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు డైరెక్టర్
నాచురల్ యాక్టింగ్...
మైఖేల్ పాత్రలో రోషన్ మెప్పించాడు. నటన, లుక్స్ పరంగానే కాకుండా డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. అనస్వరరాజన్ నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచింది. రోషన్, అనస్వర కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. రాజిరెడ్డి పాత్రలో కళ్యాణ్ చక్రవర్తిని తీసుకోవాలనే దర్శకుడి ఐడియా బాగుంది. తెలంగాణ యాసలో అతడు చెప్పిన డైలాగ్స్ కొన్ని చోట్ల సరిగ్గా కుదరలేదు. రచ్చ రవి, మురళీశర్మతో పాటు ప్రతి ఒక్కరూ తమ పరిధుల మేర ఆకట్టుకున్నారు.
పాటలు సూపర్...
మిక్కీ జే మేయర్ పాటలు బాగున్నాయి. గిర గిరా పాట ఛాంపియన్ కు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. మిగిలిన సాంగ్స్ ఆకట్టుకుంటాయి. టెక్నికల్‌గా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. 1940 నాటి కాలాన్ని కళ్ల ముందు ఆవిష్కరించారు.
ఛాంపియన్ నిజాయితీతో కూడిన భిన్నమైన ప్రయత్నం. .తెలిసిన కథనే కొత్తగా కోణంలో దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ సినిమాలో ఆవిష్కరించారు. రోషన్, అనస్వర రాజన్ యాక్టింగ్ కోసం ఓ సారి ఛాంపియన్ ను చూడొచ్చు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



