Nayanathra | యశ్ టాక్సిక్ కోసం స్టైల్ మార్చిన నయనతార తార – గ్లామర్ లుక్‌లో లేడీ సూపర్ స్టార్
యశ్ టాక్సిక్ మూవీ నుంచి నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మోడ్రన్ లుక్‌లో గ్లామరస్‌గా నయనతార కనిపిస్తోంది. ఈ పాన్ ఇండియన్ మూవీలో నయనతార గంగ అనే పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Entertainment | Published On Dec 31, 2025, 4.37 pm IST
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్స్ తర్వాత కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న మూవీ టాక్సిక్. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ పాన్ ఇండియన్ మూవీ నుండి బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా బుధవారం నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మోడ్రన్ లుక్‌లో నయనతార కనిపిస్తోంది. ఓ చేతిలో గన్ మరో చేతికి గ్లౌజ్ ధరించి ఓ పెద్ద మహల్ నుంచి ఠీవీగా నడుచుకుంటూ వస్తున్నట్లుగా డిఫరెంట్‌గా నయనతార పోస్టర్‌ను మేకర్స్ డిజైన్ చేశారు. టాక్సిక్‌లో గంగ అనే పాత్రలో నయనతార కనిపించనున్నట్లు పేర్కొన్నారు. గ్లామర్‌తో కూడిన ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను నయన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి క్యారెక్టర్లను అభిమానులకు పరిచయం చేశారు. వరుసగా హీరోయిన్ల పోస్టర్లను రిలీజ్ చేస్తూ సినిమాపై ఉన్న అంచనాలను పెంచేస్తున్నారు.
యశ్‌కు జోడీ కాదు...
కాగా టాక్సిక్ మూవీలో నయనతార పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో యశ్‌కు జోడీగా కాకుండా అతడి సోదరిగా నయనతార కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్‌కు భిన్నంగా నయన్ పాత్ర ఉంటుందట. హ్యుమా ఖురేషితో పాటు నయనతార క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని అంటున్నారు.
నలుగురు హీరోయిన్లు...
టాక్సిక్ మూవీలో నయనతారతో పాటు కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హ్యుమా ఖురేషి కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించబోతుండటం ఆసక్తికరంగా మారింది.
టాక్సిక్ మూవీలో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌తో కలిసి కథను అందిస్తున్నారు యశ్. అంతే కాకుండా ఈ పాన్ ఇండియన్ మూవీకి ఓ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. టాక్సిక్ మూవీ మార్చి 19న కన్నడ, తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






