Urea | యూరియా పంపిణీకి రంగంలోకి దిగిన స్పెషల్ ఆఫీసర్లు
Urea | యూరియా కోసం రైతన్నలు పడరాని కష్టాలు పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ యూరియా కోసం అన్నదాతలు తెల్లవారుజామునే సహకార సంఘాల కార్యాలయాల వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు.
Urea | త్రినేత్ర.న్యూస్ : యూరియా కోసం రైతన్నలు పడరాని కష్టాలు పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ యూరియా కోసం అన్నదాతలు తెల్లవారుజామునే సహకార సంఘాల కార్యాలయాల వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. కానీ కొంతమంది రైతులకే యూరియా దక్కుతుండడంతో మిగతా అన్నదాతలు చేసేదేమీలేక అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోతున్నారు. ఇదే తంతు ప్రతి రోజూ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులు.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని యాసంగి సీజన్‌లో యూరియా పంపిణీపై వ్యవసాయ శాఖ ప్రత్యేక నజర్ పెట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా పంపిణి సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది. అడిషనల్ డైరెక్టర్లు, జేడీఏలు, డీడీఏలు.. జిల్లాల్లో మకాం వేసి యూరియా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుండి జిల్లాలకు వెళ్లి ఉన్నతాధికారుల బృందం పరిశీలిస్తుంది.

బుధవారం ఉదయం నుంచె అధికారుల బృందం ఫీల్డ్ లెవల్ అందుబాటులో ఉంది. గంటల తరబడి యూరియా కోసం రైతుల క్యూ లైన్‌లో నిల్చోనే అవకాశం లేకుండానే పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల్లో యూరియా నిల్వలు పక్కదారిపట్టకుండా నిఘా పెట్టారు. ఏ రోజుకు ఆరోజు అమ్మకాలు, నిల్వలపై నివేదికలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఒక్కొక్క అధికారికి ఐదు జిల్లాలను కేటాయించారు. వ్యవసాయ శాఖ కార్యాలయం కేంద్రంగా స్పెషల్ ఆఫీసర్లను, జిల్లా అధికారులను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో సరిపడా యూరియా ఉంది.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు. మరోవైపు కలెక్టర్లను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



