New Zealand | కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజిలాండ్
ఆక్లాండ్‌లో కొత్త సంవత్సరం కోసం అంతా సిద్ధం చేశారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే తారాజువ్వలు ఆకాశంలో విహరించాయి. ఫైర్‌వర్క్స్‌తో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
International | Published On Dec 31, 2025, 5.19 pm IST
New Zealand | న్యూజిలాండ్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. 2026 సంవత్సరానికి స్వాగతం పలికిన రెండో దేశం న్యూజిలాండ్. దీనికంటే ముందే కిరిటిమాటి ఐలాండ్ తొలి దేశంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. ప్రపంచంలోనే అన్ని దేశాల సమయం కంటే ఈ దేశం టైమ్ ముందుంటుంది. జీఎంటీ ప్లస్ 14 గంటల టైమ్ జోన్‌లో ఉండే ఈ ఐలాండ్ మన దేశం కంటే 9 గంటల ముందే ఉంటుంది. సాయంత్రం 3.30 కే కిరిటిమాటి ఐలాండ్‌లో కొత్త సంవత్సరం ప్రారంభం కాగా, సరిగ్గా మన కాలమానం ప్రకారం 4.30 కు న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టింది.

ఆక్లాండ్‌లో కొత్త సంవత్సరం కోసం అంతా సిద్ధం చేశారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే తారాజువ్వలు ఆకాశంలో విహరించాయి. ఫైర్‌వర్క్స్‌తో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఆక్లాండ్‌లో ఉన్న ఐకానిక్ స్కై టవర్‌ని రంగురంగుల లైట్లతో అలంకరించారు. ఆ తర్వాత స్కై టవర్ టపాసులతో దద్దరిల్లింది.

న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియా మన కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 కు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. ఆ తర్వాత జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా రాత్రి 8.30 కు, చైనా, హాంగ్ కాంగ్, తైవాన్ రాత్రి 9.30 కి, థాయిలాండ్ రాత్రి 10.30 కి, భారత్ అండ్ శ్రీలంక మిడ్ నైడ్ 12 గంటలకు, రష్యా అర్ధరాత్రి 2.30 కి, ఉక్రెయిన్ 3.30 కు, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, స్విట్జర్లాండ్ 4.30 కు, యూకే, పోర్చుగల్ ఉదయం 8.30 కు, యూఎస్ (ఈస్ట్ కోస్ట్) ఉదయం 10.30 కు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టనున్నాయి. యూటీసీ మైనస్ 12 టైమ్ జోన్‌లో ఉన్న అమెరికా సమోవా అండ్ బేకర్, హౌలాండ్ ఐలాండ్స్ అందరి కంటే చివర్లో కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటాయి.


తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





