Telangana | త్రినేత్ర.న్యూస్ : కొత్త సంవత్సరం వేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్ నెలకు సంబంధించి రూ. 713 కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు రూ. 713 కోట్ల నిధులను బుధవారం అధికారులు విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ప్రతినెల రూ 700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని గతంలో ప్రజా ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ నెలాఖరులో రూ.183 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత ఆగస్టు మాసం నుంచి ప్రతినెల కనీసంగా 700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. విడుదల చేసిన బిల్లులో ఉద్యోగుల గ్రాట్యూటీ, జిపిఎఫ్, సరెండర్ లీవులు అడ్వాన్స్ లకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.