Shiv Pratap Shukla | హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ నూతన గవర్నర్
Shiv Pratap Shukla | తెలంగాణ నూతన గవర్నర్ (Telangana New Governor)గా శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నేడు హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు.
Shiv Pratap Shukla | తెలంగాణ నూతన గవర్నర్ (Telangana New Governor)గా శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నేడు హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, డీజీపీ ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో (Lok Bhavan) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి వర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
ఇటీవలే పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ (Ananda Bose) ఆకస్మిక రాజీనామాతో కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్‌ను మహారాష్ట్రకు పంపించారు. ఆయన స్థానంలో తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) గవర్నర్‌గా పనిచేస్తున్నారు.
Also Read..
KTR | మిలియన్ మార్చ్‌కు నేటితో 15 ఏళ్లు పూర్తి.. కీలకమైన ఘట్టాన్ని గుర్తు చేసుకున్న కేటీఆర్
Kalvakuntla Kavitha | ఖమ్మంలో హైడ్రామా.. కవిత దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసిన పోలీసులు
BCCI | టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. రూ.131 కోట్ల నగదు బహుమతి..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





