త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | పంతం నెగ్గించుకున్న సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు వీరే..

Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మ‌రోసారి త‌న పంతం నెగ్గించుకున్నారు. అస‌లు కాంగ్రెస్ నేత‌ల‌ను కాద‌ని, త‌న‌తోపాటు పార్టీలో చేరిన వ‌ల‌స‌ నేత‌కు రాజ్య‌స‌భ (Rajya Sabha) ఎంపీ అభ్య‌ర్థిత్వం ద‌క్కేలా చేసుకున్నారు.

G

Telangana | Published On Mar 5, 2026, 7.18 am IST

Revanth Reddy | పంతం నెగ్గించుకున్న సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు వీరే..
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మ‌రోసారి త‌న పంతం నెగ్గించుకున్నారు. అస‌లు కాంగ్రెస్ నేత‌ల‌ను కాద‌ని, త‌న‌తోపాటు పార్టీలో చేరిన వ‌ల‌స‌ నేత‌కు రాజ్య‌స‌భ (Rajya Sabha) ఎంపీ అభ్య‌ర్థిత్వం ద‌క్కేలా చేసుకున్నారు. రాజ్య‌భ‌సలో ఖాళీ అయిన రెండు స్థానాల‌కు కాంగ్రెస్‌ అభ్య‌ర్థిగా త‌న‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరుపొందిన వేం న‌రేంద‌ర్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం ప్ర‌క‌టించేలా చేశారు. ప్ర‌స్తుత ఎంపీ అభిషేక్ మ‌ను సింఘ్వి మ‌రోసారి రాష్ట్ర కోటాలోనే రాజ్య‌స‌భ‌కు పోటీచేస్తున్నారు. ఇద్ద‌రు నేత‌లు గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.

అధిష్ఠానం కోటా పోగా మిగిలిన ఒక్క స్థానానికి సుమారు 16 మంది రాష్ట్ర నేత‌లు పోటీప‌డ్డారు. వారిలో మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వినయ్‌కుమార్, జెట్టి కుసుమకుమార్‌ తదితరుల పేర్లు వినిపించాయి. వీరంతా పార్టీలో మొద‌టి నుంచి ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. అస‌లు కాంగ్రెస్ నేత‌ల‌ను వ‌దిలి వ‌ల‌స నేత అయిన వేం నరేందర్‌రెడ్డి పేరును పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం ఖరారుచేయ‌డంపై ఆశావ‌హులు తీవ్ర‌ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా, మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్‌ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో హనుమకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంత‌రం 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినా విజ‌యం వ‌రించ‌లేదు. అనంతరం రేవంత్‌రెడ్డితో పాటు ఆయ‌న కూడా కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న‌ను సీఎం సల‌హాదారుడిగా రేవంత్ నియ‌మించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

బీర్లు తాగేస్తున్నారు.. గ‌త 15 రోజుల్లో రికార్డు స్థాయిలో అమ్మ‌కాలు

భారత్ నుంచి వెళ్తుండగా ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి.. హిందూ మహాసముద్రంలో 80 మంది జలసమాధి

లొంగిపోయిన మావోయిస్టు అగ్ర‌నేత గ‌ణ‌ప‌తి?

హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా 'విరోష్' వెడ్డింగ్ రిసెప్షన్.. కనువిందు చేస్తున్న విజయ్-రష్మికల జోడీ!

 

 

 

 

Advertisement
Advertisement