త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy Strict Warning to Collectors | కలెక్టర్లకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్: నెలకు 10 రోజులు ఫీల్డ్ విజిట్.. నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షనే!

సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నెలకు 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఇసుక మాఫియాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

J

Telangana | Published On Mar 3, 2026, 10.10 pm IST

CM Revanth Reddy Strict Warning to Collectors | కలెక్టర్లకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్: నెలకు 10 రోజులు ఫీల్డ్ విజిట్.. నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షనే!

సంక్షిప్త సారాంశం

సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఏఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, నెలకు కనీసం 10 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మిల్లర్ల వద్ద ధాన్యం రికవరీ, ఇసుక మాఫియా అరికట్టడం వంటి అంశాలపై సీరియస్ అయ్యారు. విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కలెక్టర్, ఎస్పీలను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తామని కఠినంగా హెచ్చరించారు.

Advertisement

CM Revanth Reddy Strict Warning to Collectors | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఏఎస్ అధికారుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం.. ప్రభుత్వ లక్ష్యాలను, అధికారుల బాధ్యతలను స్పష్టంగా వివరించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఐఏఎస్ ఉద్యోగానికి సార్థకత ఉంటుందని, ఆషామాషీగా ఆ పదవి దక్కదని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారని తేల్చి చెప్పారు.

నెలకు 10 రోజులు ఫీల్డ్ విజిట్ తప్పనిసరి

ప్రభుత్వానికి అధికారులే కళ్లు, చెవులని సీఎం పేర్కొన్నారు. కలెక్టర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. "కలెక్టర్లుగా మీరు క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజల సమస్యలు ఎప్పటికీ అర్థం కావు. కాబట్టి ప్రతీ కలెక్టర్ కనీసం నెలకు 10 రోజులైనా ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే" అని సీఎం ఆదేశించారు.

మార్చి 6 నుంచి ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా “ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలి. గ్రామాలవారీగా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు, లబ్ధిదారుల వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించాలి.

విద్యా వ్యవస్థ ప్రక్షాళన.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ప్రతీ స్కూల్‌కు ఒక అధికారికి బాధ్యత అప్పగించాలి. ఆ అధికారి విద్యార్థులతో పాటే భోజనం చేయాలి. కలెక్టర్లు సైతం వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి. ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో.. నియోజకవర్గానికి ఒక మండల కేంద్రంలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ఆరుట్ల మోడల్‌లో అన్ని వసతులతో వీటిని నిర్మిస్తామని, ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను అందించాలని ఆదేశించారు.

వైద్యం, సివిల్ సప్లైస్ పైనా నజర్

ఆరోగ్య రంగం: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోంది. భవిష్యత్తులో అన్ని మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ ఆస్పత్రులను ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు.

బోగస్ ఉద్యోగులు: ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు బోగస్ ఉద్యోగులను సృష్టించే అవకాశం ఉందని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

మిల్లర్లపై ఉక్కుపాదం: మిల్లర్ల వద్ద నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టాల్సిన బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని, మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ఇసుక మాఫియాను ఉపేక్షిస్తే ఆన్‌స్పాట్ సస్పెన్షన్!

అక్రమాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. "ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలి. వీటిని అరికట్టకపోతే సంబంధిత కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తాం" అని హెచ్చరించారు.

ప్రభుత్వం అధికారుల పనితీరును నిశితంగా గమనిస్తుందని, మంచి పనులు చేస్తే కచ్చితంగా అభినందిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. వార్షిక పర్ఫామెన్స్ రిపోర్ట్ (Annual Performance Report) ఆధారంగా అధికారుల పనితీరును మదింపు చేస్తామని, జూన్ నెలలో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Advertisement
Advertisement