Cabinet Meeting | నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. మంత్రి మండలిని పునర్‌వ్యవస్థీకరిస్తారా?
Cabinet Meeting | కేంద్ర మంత్రిమండలి (Cabinet Meeting) గురువారం సాయంత్రం జరుగనుంది. ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతను ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో కేబినెట్ భేటీ కానుంది.
Cabinet Meeting | త్రినేత్ర.న్యూస్: కేంద్ర మంత్రిమండలి (Cabinet Meeting) గురువారం సాయంత్రం జరుగనుంది. ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతను ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశానికి క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులు (Council of Ministers) హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వీలుగా మంత్రులంతా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మోదీ ప్రభుత్వంలోని మంత్రులంతా సమావేశం కానుండటం ఈ ఏడాది ఇదే తొలిసారి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, దేశంపై పడిన ఆర్థిక ప్రభావం గురించి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిపోతుండటంతో చమురు ధరలు, ఇంధన సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఆందోళనలను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నది. ఈ సంక్షోభం నుంచి భారత్‌ను రక్షించడానికి తీసుకోవలసిన చర్యలను సూచించడానికి ప్రభుత్వం ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో మంత్రులతో కూడిన సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ సమావేశంలో వీటన్నిటిపై చర్చించనున్నట్లు సమాచారం.
కాగా, వచ్చే ఏడాది 7 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో గురువారం నాటి కేబినెట్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ రెండో వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశముందని తెలుస్తున్నది. కొందరు మంత్రులకు ఇదే చివరి సమావేశమని ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో 30మంది క్యాబినెట్ మంత్రులు, 36మంది సహాయ, ఐదుగురు స్వతంత్ర హోదా.. మొత్తం 72 మంది మంత్రులు ఉన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






