Cockroach Janata Party | కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ బ్లాక్
Cockroach Janata Party | సోషల్ మీడియాలో రాజకీయ ఉద్యమంగా పుట్టుకొచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party)కి భారీ షాక్ తగిలింది. భారత్‌లో ఆ పార్టీ ఎక్స్ అకౌంట్ బ్లాక్ అయ్యింది.
Cockroach Janata Party | సోషల్ మీడియాలో రాజకీయ ఉద్యమంగా పుట్టుకొచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party)కి భారీ షాక్ తగిలింది. భారత్‌లో ఆ పార్టీ ఎక్స్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ప్రారంభించిన ఈ పార్టీపై ఎక్స్ లీగల్ యాక్షన్ తీసుకుంది. ఈ విషయాన్ని అభిజీత్ దిప్కే ధృవీకరించారు. "ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను భారత్‌లో నిలిపివేశారు" అని పేర్కొన్నారు. ఈ మేరకు అకౌంట్ విత్‌హెల్డ్ స్క్రీన్‌షాట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది యువత సోషల్ మీడియా, ఆర్‌టీఐ కార్యకర్తలుగా మారి బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సీజేఐ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party).
కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కాన్వా (Canva) డిజైన్ల సహాయంతో రాత్రికి రాత్రే ఏర్పాటైన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. పార్టీ పెట్టి వారం రోజులు కూడా తిరగకముందే లక్షల్లో ఫాలోవర్స్‌ను సంపాదించి హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా బీజేపీ, కాంగ్రెస్ లాంటి దిగ్గజ పార్టీలను మించిపోయి.. దేశంలోనే అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ పరిణామం చోటు చేసుకున్న కొన్ని గంటల్లోనే కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతాపై నిషేధం విధించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇదే పార్టీ నినాదం..
తమను తాము ‘సోమరులు, నిరుద్యోగుల గొంతుక’గా ప్రకటించుకున్న ఈ పార్టీ.. తమ నినాదాన్ని ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ’ అని చెప్పుకుంటోంది.
పార్టీలో చేరాలంటే ఈ అర్హతలు మస్ట్..
అలాగే ఈ పార్టీలో చేరడానికి వింతైన అర్హతలను కూడా పెట్టింది. పార్టీలో చేరాలంటే నిరుద్యోగి అయి ఉండాలని, సోమరితం ఉండాలని, సోషల్ మీడియాకి అతుక్కొని ఉండాలని, ప్రజా సమస్యలపై గళం విప్పే అలవాటు ఉండాలని స్పష్టం చేసింది.
‘కాక్రోచ్’ మేనిఫెస్టో..
- న్యాయమూర్తులకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు.
- ఓటర్ల జాబితా నుండి అర్హులైన ఓట్లు తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేయాలి.
- చట్టసభల్లో మహిళలకు 33 శాతం కాకుండా.. 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. అంతేకాదు, మంత్రివర్గంలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
- అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్న మీడియా లైసెన్సులను రద్దు చేసి స్వతంత్ర మీడియాకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటూ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి.
Also Read..
మెలోనీకి ప్రత్యేక కానుకలు ఇచ్చిన ప్రధాని మోదీ.. అవేంటంటే..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి
అక్టోబర్ 17, 2026

Ex-IAS Divya Mittal Political Party | ఐఏఎస్ వదిలి ‘జననీతి భారత్’ పార్టీ పెట్టిన దివ్యా మిట్టల్.. 2027 యూపీ ఎన్నికల్లో పోటీ
అక్టోబర్ 17, 2026

Neha Bora | మహిళలను రాత్రిపూట నిర్బంధించడమేంటి..? ఇది ఏ చట్టప్రకారం సమర్థనీయం : నేహా బోరా
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●Dudimetla Balaraju Yadav | కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పే ఆ ఆరుగురు ఎవరంటే..
- ●BCCI | బీసీసీఐ సెలక్టర్ రేసులో వసీం జాఫర్.. చీఫ్ సెలక్టర్ పీఠంపై ఉత్కంఠ!
- ●Anirudh - Kavya Maran | నవంబర్‌లో అనిరుధ్, కావ్యమారన్ వివాహం - ప్రముఖులకు ఆహ్వానం
- ●PM-AJAY Scheme Adarsh Grams | పీఎం-అజయ్ పథకం ఘనత: 18,093 ఆదర్శ గ్రామాలు.. పూర్తయిన విద్యార్థి హాస్టళ్లు ఇవే!
- ●Director | దర్శకుడిగా కల నెరవేరిన మరుసటిరోజే విషాదం - మలయాళ యంగ్ డైరెక్టర్ హఠాన్మరణం
- ●SIP | ఉద్యోగం కోల్పోతే ఎస్ఐపీకి దెబ్బ.. గ్యాప్ తరువాత ఎంత పెంచాలి..?

Dudimetla Balaraju Yadav | కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పే ఆ ఆరుగురు ఎవరంటే..

BCCI | బీసీసీఐ సెలక్టర్ రేసులో వసీం జాఫర్.. చీఫ్ సెలక్టర్ పీఠంపై ఉత్కంఠ!

Anirudh - Kavya Maran | నవంబర్‌లో అనిరుధ్, కావ్యమారన్ వివాహం - ప్రముఖులకు ఆహ్వానం

PM-AJAY Scheme Adarsh Grams | పీఎం-అజయ్ పథకం ఘనత: 18,093 ఆదర్శ గ్రామాలు.. పూర్తయిన విద్యార్థి హాస్టళ్లు ఇవే!



