త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | మ‌రోసారి జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్‌పై జీవ‌న్‌రెడ్డి ఫైర్‌

Jeevan Reddy | బీఆర్ఎస్ (BRS) త‌ర‌పున గెలిచి, కాంగ్రెస్ (Congress)లో చేరిన జ‌గిత్యాల (Jagityal) ఎమ్మెల్యే (MLA) సంజ‌య్‌ (Sanjay)పై మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి (Jeevan Reddy) మ‌రోసారి ఫైర్ అయ్యారు. ఎన్న‌డూ కాంగ్రెస్ పార్టీ జెండా ప‌ట్ట‌నోడు పార్టీ టికెట్లు నా ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని ఎలా అంటాడ‌ని ప్ర‌శ్నించారు. నువ్వెవ‌రు అంటూ నిప్పులు చెరిగారు.

A

Telangana | Published On Jan 4, 2026, 4.58 pm IST

Jeevan Reddy | మ‌రోసారి జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్‌పై జీవ‌న్‌రెడ్డి ఫైర్‌
Advertisement

Jeevan Reddy | బీఆర్ఎస్ (BRS) త‌ర‌పున గెలిచి, కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన జ‌గిత్యాల (Jagityal) ఎమ్మెల్యే (MLA) సంజ‌య్‌ (Sanjay)పై మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి (Jeevan Reddy) మ‌రోసారి ఫైర్ అయ్యారు. ఎన్న‌డూ కాంగ్రెస్ పార్టీ జెండా ప‌ట్ట‌నోడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు నా ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని ఎలా అంటాడ‌ని ప్ర‌శ్నించారు. అస‌లు నువ్వెవ‌రు అంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అంగ‌ట్లో స‌రుకుకాద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌దేళ్లు కాంగ్రెస్ పార్టీ జెండా మోశామ‌ని అన్నారు. కార్య‌క‌ర్త‌లంతా అహ‌ర్నిష‌లు శ్ర‌మించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ముందుకుసాగామ‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌గా, విశ్వ‌సనీయ‌త‌కు మారుపేరుగా పార్టీ జెండా భుజాన మోస్తే అప్పుడు విలువ తెలుస్తుంద‌ని అన్నారు.

టికెట్లు పంచుకుందామ‌నుకుంటే అది ఎవ‌రి అబ్బ సొత్తు కాద‌ని, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల హ‌క్కు అని అభిప్రాయ‌ప‌డ్డారు. యాభై స్థానాల్లో గెలిచి, జ‌గిత్యాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగుర‌వేస్తామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ విధానాలు న‌చ్చితే మ‌ద్ద‌తు తెల‌పాల‌ని, కానీ కాంగ్రెస్ పార్టీల దూకుతా అంటే.. అస‌లు నువ్వెవ‌ర‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం వేరు.. పార్టీ వేర‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement