Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ క్రేజీ వెడ్డింగ్ – కొత్త ఏడాది గుడ్‌న్యూస్ వినిపించిన హీరోయిన్
కొత్త ఏడాదిలో అభిమానులకు గుడ్‌న్యూస్ వినిపించింది అనుపమ పరమేశ్వరన్. క్రేజీ కళ్యాణం పేరుతో ఓ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్ హీరోగా నటిస్తున్నాడు.
Entertainment | Published On Jan 5, 2026, 3.52 pm IST
Anupama Parameswaran | కొత్త ఏడాదిలో అనుపమ పరమేశ్వరన్ గుడ్‌న్యూస్ వినిపించింది. పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. అయితే రియల్ లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో. క్రేజీ కళ్యాణం పేరుతో తెలుగులో ఓ సినిమా చేయబోతున్నట్లు అనుపమ పరమేశ్వరన్ ప్రకటించింది. సోమవారం ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పెళ్లి వేడుక నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్ హీరోగా నటిస్తున్నాడు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో పాటు నరేష్ విజయ్ కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో భద్రప్ప గాజుల దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో...
క్రేజీ కళ్యాణం టైటిల్ పోస్టర్‌లో బ్యాండ్, మందు బాటిల్, బుక్ కనిపించడం ఆసక్తిని పంచుతోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం. తెలంగాణ పెళ్లి వేడుకల్లో ఎలాంటి ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తారు? ఓ జంట పెళ్లికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నది సరదాగా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్రేజీ కళ్యాణం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి సురేష్ బొబ్బలి మ్యూజిక్ అందిస్తున్నారు.
గత ఏడాది ఏడు సినిమాలు...
గత ఏడాది తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కలిపి ఏకంగా ఏడు సినిమాలు చేసింది అనుపమ పరమేశ్వరన్. నేటితరం హీరోయిన్లలో ఒకే ఇయర్‌లో అత్యధిక సినిమాలు చేసిన నాయికగా నిలిచింది. డ్రాగన్, కిష్కిందపురి, బైసన్ సినిమాలతో విజయాలను అందుకుంది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన లాక్‌డౌన్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ మూవీ అనివార్య కారణాల వల్ల వాయిదాపడింది.
మరోవైపు గత ఏడాది రాజు వెడ్స్ రాంబాయి, ఈషా సినిమాలతో హీరోగా విజయాలను అందుకున్నాడు అఖిల్ రాజు. ఈ బ్లాక్‌బస్టర్స్ తర్వాత క్రేజీ కళ్యాణం మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



