త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nikitha Rao Godishala | మాజీ ప్రియుడి ఘాతుకం.. యూఎస్‌లో హైదరాబాద్ యువతి దారుణ హత్య

అయితే.. అర్జున్ శర్మతో తనకు ఏంటి సంబంధం? అసలు అర్జున్ శర్మ ఎందుకు తనను చంపాడు? ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? అర్జున్ ఫ్లాట్‌కి నిఖిత ఎందుకు వెళ్లింది? అనే విషయాలపై మేరీలాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అర్జున్ కోసం గాలిస్తున్నారు.

J

Crime | Published On Jan 5, 2026, 3.26 pm IST

Nikitha Rao Godishala | మాజీ ప్రియుడి ఘాతుకం.. యూఎస్‌లో హైదరాబాద్ యువతి దారుణ హత్య
Advertisement

Nikitha Rao Godishala | అమెరికాలోని మేరీలాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కి చెందిన 27 ఏళ్ల యువతి నిఖితా రావు గొడిశల దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్‌లోని తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఇంట్లో ఆ యువతి మృతదేహం లభ్యమైంది. జనవరి 2న నిఖిత కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్జున్ ఆ తర్వాత తిరిగి ఇండియాకు వచ్చేశాడు. మేరీలాండ్ సిటీలో కొత్త సంవత్సరం వేడుకల సమయం నుంచి తను కనిపించడం లేదని మేరీలాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తప్పించుకొని భారత్‌కి వచ్చాడు.

nikitha rao godishala killed by ex boyfriend in us

కానీ.. డిసెంబర్ 31, 2025న సాయంత్రం 7 గంటల సమయంలో నిఖితా రావుని అర్జున్ శర్మ తన తన ఇంట్లోనే హత్య చేశాడు. జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఇండియాకి వచ్చాడు.

మేరీలాండ్‌లోని కొలంబియాలో వీహెదా హెల్త్ అనే కంపెనీలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్టుగా నిఖితా పని చేస్తోంది. ఫిబ్రవరి 2025లో ఈ కంపెనీలో చేరింది. 2021 లో తన ఫార్మసీ పూర్తయ్యాక మాస్టర్స్‌ కోసం యూఎస్‌కి వెళ్లిన నిఖిత ఆ తర్వాత అక్కడే జాబ్ చేస్తూ స్థిరపడింది.

తాజావార్తలు

Advertisement