హీరోగా మారనున్న అకీరా నందన్ – పవన్ కళ్యాణ్ నిర్మాతగా డెబ్యూ మూవీ?
అకీరా నందన్ హీరో ఎంట్రీ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ స్వీయ నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ త్వరలోనే రీ లాంఛ్ కాబోతుంది. ఈ బ్యానర్ నుంచి సోమవారం మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు. అకీరా నందన్ డెబ్యూ గురించే ఈ పోస్ట్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Entertainment | Published On Jan 5, 2026, 3.07 pm IST
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓజీలో అకీరా నందన్ నటించినట్లు ప్రచారం జరిగింది. చివరకు అది రూమర్‌గానే తేలింది. తాజాగా సోమవారం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ పెట్టిన ఓ పోస్ట్‌తో మరోసారి అకీరా నందన్ హీరో వార్తలు తెరపైకి వచ్చాయి. తనయుడిని కథానాయకుడిగా పరిచయం చేసే బాధ్యతను తండ్రి పవన్ కళ్యాణ్ స్వయంగా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై సర్ధార్ గబ్బర్ సింగ్‌తో పాటు ఛల్ మోహన రంగ సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత ఈ బ్యానర్‌లో మళ్లీ సినిమాలు చేయలేదు పవన్ కళ్యాణ్.
మార్షల్ ఆర్ట్స్ జర్నీ...
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌ను రీ లాంఛ్ చేయబోతున్నట్లు ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ బ్యానర్‌పై వరుసగా కొత్త సినిమాలు చేస్తానని ప్రకటించారు. సోమవారం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీలో కొత్త ఫేజ్.... జనవరి 7 అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ వాడిన కత్తి కనిపిస్తోంది. ఈ పోస్టర్‌ను పవన్ కళ్యాణ్ క్రియేట్ వర్క్స్ బ్యానర్ తమ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అభిమానులతో పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఓజీ కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఈ ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియోలను బుధవారం రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం అకీరా నందన్ ఎంట్రీ గురించి జనవరి 7న అప్‌డేట్ రావచ్చునని కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌ను అకీరా నందన్ డెబ్యూ మూవీ కోసమే పవన్ కళ్యాణ్ రీలాంఛ్ చేశారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో అకీరా నందన్ తొలి సినిమా ఈ ఏడాదే లాంఛ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
అందరి కంటే ఎక్కువగా...
అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడంపై ఇటీవల పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అకీరా నందన్ హీరో కావాలని అందరి కంటే తానే ఎక్కువగా కోరుకుంటున్నానని, రోజు కొబ్బరి కాయలు కొడుతున్నట్లు రేణు దేశాయ్ అన్నది. ఆమె కామెంట్స్ చేసిన రెండు రోజులకే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ యాక్టివ్‌గా మారడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



