Uttam Kumar Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల ఆగింది: మంత్రి ఉత్తమ్
Uttam Kumar Reddy | తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తరువాతే తమ ఒత్తిడి వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme) ఆగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. గతంలో ఆగిఉంటే బీఆర్ఎస్ (BRS) ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
Uttam Kumar Reddy | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme) ఆగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. గతంలో ఆగిఉంటే బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తమ ఒత్తిడి వల్లే ఏపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకం పనులు ఆపేశారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణ-గోదావరి జలాల విషయంలో తెలివి ఎక్కువ, పని తక్కువ చందంగా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అతి తెలివితో తెలంగాణకు భారీనష్టం చేసిందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడంతో పాటు, తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరంను మార్చి భారీ నష్టం చేశారని మండిపడ్డారు.
పోలవరం - నల్లమల్ల సాగర్‌ను తమ ప్రభుత్వం అన్ని వేదికలపైనా వ్యతిరేకిస్తున్నామని ఉత్తమ్ చెప్పారు. హరీష్ రావు చూపిస్తున్న లేఖ దీనికి సంబంధించినది కాదని అన్నారు. పోలవరం - నల్లమల్ల అంతర్ రాష్ట్ర నిబంధనలకు వ్యతిరేకమని తాము గతంలోనే జీఆర్ఎంబీకి లేఖ రాశామని, తమ అభిప్రాయాన్ని సైతం జీఆర్ఎంబీ సమర్థించిందని వివరించారు. ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామన్నారు. ఈ కేసును వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని, రిట్ పిటిషన్ కాకుండా సూట్ పిటిషన్‌లో రావాలని సూచించిందని చెప్పారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును వచ్చే సోమవారం కోరుతామని తెలిపారు. తదుపరి విచారణకు తాను నేరుగా హాజరవుతానని ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో మరోసారి న్యాయవాదులతో సమావేశమవుతామని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



