MLC Kavitha | ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మ గౌరవ పంచాయితీ: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | హైదరాబాద్: మా ఇంటి దైవం లక్ష్మీ నరసింహ స్వామిపై, నా ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేసి చెబుతున్నా, మాది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మ గౌరవ పంచాయితీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
MLC Kavitha | హైదరాబాద్: మా ఇంటి దైవం లక్ష్మీ నరసింహ స్వామిపై, నా ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేసి చెబుతున్నా, మాది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మ గౌరవ పంచాయితీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పలు అంశాలపై మాట్లాడిన ఆమె కంట తడి పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీ మార్చేందుకు తాను ఒప్పుకోలేదని తెలిపారు. కేసీఆర్‌పై కక్షతో బీజేపీ తనను జైల్లో పెట్టిందని, 8 ఏళ్లుగా ప్రజల కోసం తాను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారని అన్నారు. ఈడీ, సీబీఐలపై తాను పోరాడినా బీఆర్ఎస్ తనకు అండగా నిలవలేదన్నారు. కక్ష గట్టి తనను పార్టీ నుంచి బహిష్కరించారని విచారం వ్యక్తం చేశారు.
ఉద్యమకారులు, సూటిగా ప్రశ్నించే వారి పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని కవిత అన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తేకపోవడం విచారకరమని, పార్టీ మౌత్ పీస్‌గా ఉన్న పేపర్లు, చానళ్లు తనకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్‌కు అవినీతి మరక అంటితే తాను పోరాడానని, ఇసుక దందాలతో నేరెళ్లలాంటి ఘటనల్లో దళితులు బాధితులుగా మారారని అన్నారు. అందుకనే పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి.. అని గట్టిగా మాట్లాడానని, తన బహిష్కరణ ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదని అన్నారు. తన సస్పెన్షన్‌కు ముందు తనను వివరణ కోరలేదని, నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి సచివాలయ నిర్మాణం వరకు ప్రతి దాంట్లో అవినీతి చోటు చేసుకుందని వివరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



