త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rayalaseema Lift Irrigation Scheme | బీఆర్ ఎస్ ఫిర్యాదుతోనే రాయలసీమ ‘లిప్ట్’ నిలిచిపోయింది: ఏపీ మంత్రి స‌విత‌

Rayalaseema Lift Irrigation Scheme | రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme) నిలిచిపోయేందుకు ప్రధాన కారణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అని మంత్రి ఏపీ ఎస్.సవిత (Savitha) స్పష్టంచేశారు. 2020లో ఆనాటి తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో ఎన్జీటీ ప‌థ‌కాన్ని నిలిపివేయించింద‌ని చెప్పారు.

A

Telangana | Published On Jan 5, 2026, 3.43 pm IST

Rayalaseema Lift Irrigation Scheme | బీఆర్ ఎస్ ఫిర్యాదుతోనే రాయలసీమ ‘లిప్ట్’ నిలిచిపోయింది: ఏపీ మంత్రి స‌విత‌
Advertisement

2020లో అప్ప‌టి తెలంగాణ ప్ర‌భుత్వ ఫిర్యాదు
ఎన్జీటీ ఆదేశంతో ఎత్తిపోతల పథకం నిలిపివేత‌
ఏపీ నీటి హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

Rayalaseema Lift Irrigation Scheme | రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme) నిలిచిపోయేందుకు ప్రధాన కారణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అని రాష్ట్ర మంత్రి ఎస్.సవిత (Savitha) స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబును బూచిగా చూపి రాజకీయ ఉనికి చాటుకోవడం తెలంగాణ రాష్ట్ర అధికార, విపక్షాలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. 2020లో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథక నిర్మాణం చేపడుతున్నామని జగన్ ప్రభుత్వం అట్టాహాసంగా ప్రకటించిందన్నారు. ఈ ప్రకటనపై ఆనాటి తెలంగాణ (Telangana)లో అధికారంలో ఉన్న కేసీఆర్ (KCR) నేతృత్వంలోని ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో, కేంద్రంతో పాటు ఎన్జీటీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాయన్నారు. ఇదే విషయంపై అప్పట్లో మీడియాలోనూ ప్రచురితమైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జగన్ చేసిన తప్పిదాలను తన సొంత మీడియా ద్వారా కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడా తప్పిదాన్ని మభ్య పెడుతూ, తెలంగాణ సీఎం పేరుతో ఆయన సొంత మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారన్నారు. ఇది ముమ్మాటికీ రాయలసీమకు జగన్ చేసిన ద్రోహమేనన్నారు. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ప‌డే ప్రసక్తే లేదని మంత్రి సవిత తేల్చిచెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement