N Ramachander Rao | తెలంగాణలో బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు: రాంచందర్ రావు
N Ramachander Rao | తెలంగాణలో బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (N Ramachander Rao) అన్నారు. మేడ్చల్ జిల్లాలో ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender)కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లకు పార్టీ గ్రూప్ తగాదాలకు సంబంధం లేదని చెప్పారు.
N Ramachander Rao | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (N Ramachander Rao) అన్నారు. మేడ్చల్ జిల్లాలో ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender)కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లకు పార్టీ గ్రూప్ తగాదాలకు సంబంధం లేదని చెప్పారు. తమ పార్టీలో విబేధాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆ పోస్టర్లతో తమ నాయకులకు సంబంధం లేదన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోస్టర్ల విషయమైన డీజీపీ, కమిషనర్‌కు పిర్యాదు చేశామన్నారు. జూన్ 2న ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరవుతారని వెల్లడించారు.

బీజీపీలో హాట్ టాపిక్‌గా ఈటల పోస్టర్లు..
మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు బీజేపీలో హాట్ టాపిక్‌గా మారాయి. నీ ఏడుపే బీజేపీకి శాపం అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పార్టీలో కలకలం సృష్టించాయి.
`ఈటల ఏడుపే బీజేపీకి శాపం..!
రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు..
సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు..
కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు..
రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ..
ఓడిపోయినా మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ..
మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా..
నా ఇమేజ్‌తోనే గెలిచాను అనడం ఏ రాజకీయ నైతికత..?` అంటూ ఆ పోస్టర్లలో ఎంపీ ఈటలను దుయ్యబట్టారు.
బీజేపీని బలహీన పరిచేందుకే..
ఈ పోస్టర్ల వ్యవహారంపై ఇప్పటికే రామచందర్ రావు స్పందించారు. బీజేపీని బలహీన పరచాలనే ఈటలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. బీజేపీలో ఐక్యత స్పష్టంగా కనిపిస్తుండడంతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొంత మంది ఈటెల రాజేందర్ మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలో పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టారు. ఇలాంటి చర్యలను బీజేపీ వ్యతిరేకిస్తుంది.
బీజేపీ నేతల మధ్య ఐక్యత కనబడుతుంది కాబట్టి కొన్ని పార్టీలు చేస్తున్న పన్నాగం ఇది. పార్టీని బలహీన పరచడానికి కొన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. ఆ పార్టీలను, వ్యక్తులను చిల్లర రాజకీయం చేయొద్దని హెచ్చరిస్తుంది. బీజేపీ నేతల మధ్య విబేధాలు, అంతర్ యుద్ధం సృష్టించొద్దు. బీజేపీ బలంగా, ఐక్యంగా ఉంది. ఎదురుగా వచ్చి రాజకీయం చేయలేని పార్టీలు బీజేపీని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నాయి.
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్






