N Ramachander Rao | బీజేపీని బలహీన పరచాలనే ఈటలపై ఫ్లెక్సీలు : ఎన్ రామచందర్ రావు
N Ramachander Rao | మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీల ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. బీజేపీని బలహీన పరచాలనే ఈటలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.
N Ramachander Rao | త్రినేత్ర.న్యూస్ : మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీల ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. బీజేపీని బలహీన పరచాలనే ఈటలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. బీజేపీలో ఐక్యత స్పష్టంగా కనిపిస్తుండడంతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు రాచమందర్ రావు వీడియో సందేశం విడుదల చేశారు.
కొంత మంది ఈటెల రాజేందర్ మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలో పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టారు. ఇలాంటి చర్యలను బీజేపీ వ్యతిరేకిస్తుంది. బీజేపీ నేతల మధ్య ఐక్యత కనబడుతుంది కాబట్టి కొన్ని పార్టీలు చేస్తున్న పన్నాగం ఇది. పార్టీని బలహీన పరచడానికి కొన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. ఆ పార్టీలను, వ్యక్తులను చిల్లర రాజకీయం చేయొద్దని హెచ్చరిస్తుంది. బీజేపీ నేతల మధ్య విబేధాలు, అంతర్ యుద్ధం సృష్టించొద్దు. బీజేపీ బలంగా, ఐక్యంగా ఉంది. ఎదురుగా వచ్చి రాజకీయం చేయలేని పార్టీలు బీజేపీని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నాయి. డీజీపీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కమిషనరేట్లకు ఫిర్యాదు చేశాం. తప్పకుండా విచారణ చేయాలి. చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాం అని రామచందర్ రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్





