Etela Rajender | ‘నీ ఏడుపే బీజేపీకి శాపం’.. ఈటలకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు
Etela Rajender | భారతీయ జనతా పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత రాజకీయాలు బజారుకెక్కాయి. మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు భారతీయ జనతా పార్టీలో కలకలం రేపుతున్నాయి.
Etela Rajender | త్రినేత్ర.న్యూస్ : భారతీయ జనతా పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత రాజకీయాలు బజారుకెక్కాయి. మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు భారతీయ జనతా పార్టీలో కలకలం రేపుతున్నాయి. నీ ఏడుపే బీజేపీకి శాపం అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు బీజేపీతో పాటు ఇతర పార్టీల్లో చర్చనీయాంశంగా మారాయి.
అసలు ఫ్లెక్సీలో ఏముందంటే..?
ఈటల ఏడుపే బీజేపీకి శాపం..!
రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు..
సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు..
కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు..
రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ..
ఓడిపోయినా మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ..
మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా..
నా ఇమేజ్‌తోనే గెలిచాను అనడం ఏ రాజకీయ నైతికత..?
బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు..?
ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్‌కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు..?
నేనే బీసీ నాయకుడిని.. నేనే ప్రత్యామ్నాయం అనే భ్రమల్లో నుంచి బయటకు రా ఈటల..!
బీజేపీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందంటూ.. ఫ్లెక్సీలపై ముద్రించారు.
సంబంధిత వార్తలు

Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు
జులై 28, 2026

Prajavani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
జులై 28, 2026

Chanagani Dayakar | హైడ్రా వచ్చాక 3,350 ఎకరాల భూమి కాపాడింది.. బీఆర్ఎస్ ఆక్రమణలను కూల్చినందుకే ఈ దుష్ప్రచారం
జులై 28, 2026
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్



