MLC Thatha Madhu | రైతులకు యూరియా ఇవ్వలేని దద్దమ్మ మంత్రి తుమ్మల : ఎమ్మెల్సీ తాత మధు
MLC Thatha Madhu | మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao)పై ఎమ్మెల్సీ తాత మధు (MLC Thatha Madhu) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
MLC Thatha Madhu | మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao)పై ఎమ్మెల్సీ తాత మధు (MLC Thatha Madhu) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఓ అహంకారి అని, ఈ విషయం అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. రైతులకు యూరియా ఇవ్వలేని దద్దమ్మ మంత్రి తుమ్మల అని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
"ప్రభుత్వంలో సిగ్గుమాలిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది తుమ్మల నాగేశ్వరరావే. షాపులో యూరియా లేదు గాని యాప్‌లో యూరియా ఉందని గొప్పలు చెబుతుంటారు. ఆయన జీవితం మొత్తం మొక్కుడు, తొక్కుడే ఉంటుంది. తాను లేకపోతే ఖమ్మం జిల్లానే లేదని గొప్పలు చెప్పుకుంటాడు. ఇన్నేండ్లపాటు మంత్రిగా పనిచేసిన తుమ్మలకు భక్త రామదాసు ప్రాజెక్టు కట్టాలనే ఆలోచనే రాలేదు. సీతారామ ప్రాజెక్టు నా కళల ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూనే.. దానికి పర్మిషన్ లేదని అంటాడు. డిలిమిటేషన్ జరిగితే సత్తుపల్లి జనరల్ అవుతుంది. అందుకే సత్తుపల్లి వెళ్లేందుకు తుమ్మల నాగేశ్వరరావు సిద్ధమయ్యాడు. సత్తుపల్లికి గోదావరి నీళ్లు ఇచ్చి 12 శాతం కమిషన్‌లు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. బయ్యారం రిజర్వాయర్‌ను డీ లింక్ చేశారని తుమ్మల నాగేశ్వరరావు అబద్ధం ఆడుతున్నాడు. హరీష్ రావు గురించి మాట్లాడే నైతిక హక్కు తుమ్మలకు లేదు. ఆ స్థాయి కూడా ఆయనది కాదు. కేసీఆర్‌కు కుడి భుజంగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన వ్యక్తి హరీష్ రావు. రాజకీయ విలువల గురించి మాట్లాడే అర్హత తుమ్మలకు లేదు. అన్నం పెట్టిన ఇంటికి సున్నం వేసే వ్యక్తి తుమ్మల. కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు ఇచ్చిన నిధులు ఎన్నో మంత్రి చెప్పాలి. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలి. కేసీఆర్ వల్లే ఖమ్మం అభివృద్ధి జరిగింది" అని తాత మధు పేర్కొన్నారు.
Also Read..
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ జోక్యం అవసరం: జేఏసీ ఛైర్మన్ వెంకన్న
ధాన్యం నిల్వల్లో రూ.11 వేల కోట్ల కుంభకోణం: మంత్రి కోమటిరెడ్డి
వార్ ఎఫెక్ట్.. భారత్‌లో ఐదేళ్ల కనిష్టానికి ఎరువుల ఉత్పత్తి
తాజావార్తలు
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు
- ●BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు
- ●Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..
- ●BJYM | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం
- ●One Nation One Election 2029 | 2029లోనే 'జమిలి' సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్

Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!

Etala Rajendar | కాంగ్రెస్లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు

BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు

Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..






