త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maha News | మ‌హా న్యూస్‌పై ఉద‌య్ కుమార్ ఫిర్యాదు.. క్రిమిన‌ల్ చ‌ర్య‌లకు డిమాండ్

Maha News | బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కుటుంబ స‌భ్యుల‌పై అసాంఘిక‌, అవ‌మాన‌క‌ర ప్ర‌సారాలు చేస్తున్న మ‌హా న్యూస్ చానెల్‌పై ఉద‌య్ కుమార్ అనే వ్య‌క్తి నార్సింగి పోలీసుల‌కు సోమ‌వారం ఫిర్యాదు చేశారు.

S

Telangana | Published On May 18, 2026, 3.24 pm IST

Maha News | మ‌హా న్యూస్‌పై ఉద‌య్ కుమార్ ఫిర్యాదు.. క్రిమిన‌ల్ చ‌ర్య‌లకు డిమాండ్
Advertisement

Maha News | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కుటుంబ స‌భ్యుల‌పై అసాంఘిక‌, అవ‌మాన‌క‌ర ప్ర‌సారాలు చేస్తున్న మ‌హా న్యూస్ చానెల్‌పై ఉద‌య్ కుమార్ అనే వ్య‌క్తి నార్సింగి పోలీసుల‌కు సోమ‌వారం ఫిర్యాదు చేశారు.

గ‌త మూడు రోజులుగా మ‌హా న్యూస్ తెలుగు టీవీ చానెల్ యాజ‌మాన్యం.. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కుమారుడి వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీసే విధంగా స్క్రోలింగ్లు, ప్ర‌సారాలు చేస్తూ స‌మాజంలో అసాంఘిక శ‌క్తుల‌ను రెచ్చ‌గొట్టే విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ ప్ర‌సారాలన్నీ కూడా వంశీకృష్ణ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్నాయ‌ని ఆరోపించారు.

ఇటీవ‌ల పోక్సో కేసులో నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బండి భ‌గీర‌థ్ అనే యువ‌కుడు బండి సంజ‌య్ కుమారుడిగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ కేసులో బాధిత మైన‌ర్‌కు, వారి కుటుంబ స‌భ్యుల‌కు న్యాయం జ‌ర‌గాల‌ని, అలాగే తెలంగాణ రాష్ట్ర మ‌హిళ‌ల‌కు మ‌ద్ద‌తుగా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్రెస్‌మీట్ ద్వారా స్పందించి, నిందితుల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాల‌ని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.

ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేని కొంత‌మంది వ్య‌క్తులు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌తిష్ట‌ను రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఆర్ఎస్పీ పేరుప్ర‌ఖ్యాతుల‌ను నాశ‌నం చేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్న మ‌హా న్యూస్ చానెల్ ఎండీ వంశీకృష్ణ‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయాల‌ని, కుటుంబ స‌భ్యుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్న వారిపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అలాగే ఆ అవమానకర స్క్రోలింగ్లు, ప్రసారాలను తక్షణమే నిలిపివేయించి టీవీ ఛానల్ నుండి తొలగించాల్సిందిగా మనవి చేస్తున్న‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement