Komatireddy Venkat Reddy | ధాన్యం నిల్వల్లో రూ.11 వేల కోట్ల కుంభకోణం: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy | మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం నల్గొండ(Nallagonda) జిల్లాలో విస్తృత పర్యటన చేశారు. ఈ క్రమంలో రబీ (Rabhi) ధాన్యం సేకరణ(Procurement of grain)పై అధికారులతో ఆయన సమీక్షించారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, అన్ని కేంద్రాలకు అవసరమైన మేరకు లారీలు పెంచాలని అధికారులను ఆదేశించారు.
Flash news | Published On Apr 21, 2026, 1.03 pm IST
Komatireddy Venkat Reddy: త్రినేత్ర.న్యూస్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం నల్గొండ(Nallagonda) జిల్లాలో విస్తృత పర్యటన చేశారు. ఈ క్రమంలో రబీ (Rabi) ధాన్యం సేకరణ(Procurement of grain)పై అధికారులతో ఆయన సమీక్షించారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, అన్ని కేంద్రాలకు అవసరమైన మేరకు లారీలు పెంచాలని అధికారులను ఆదేశించారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు పంపాలన్నారు. నల్గొండ నియోజకవర్గంలో 2.30 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం నిల్వల విషయంలో రూ.11 వేల కోట్ల కుంభకోణం(scam) జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ స్కామ్‌పై కేసులు కూడా నమోదైనట్లు ఆయన తెలిపారు.
ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశమున్న గ్రామాలకు ఎక్కువ లారీలను కేటాయించాలని చెప్పారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా చూడాలన్నారు. స్కూళ్లు, ఫంక్షన్ హాళ్ల వద్ద కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసి 3.78 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. కేసీఆర్, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి తినే బియ్యమే పేదలకు సరఫరా చేస్తున్నాం. పదేళ్లలో అప్పులు చేసి వెళ్లి.. ఒకేసారి బంగారు తెలంగాణ చేయాలంటే సాధ్యమేనా? అని ఆయన ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి
- ●Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ

Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్




