KTR | పళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు.. కేటీఆర్‌పై రేవంత్ విమర్శలు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. రైతులకు సాయం చేయాల్సింది పోయి పళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు దిగుతున్నారు అని సీఎం విమర్శించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. రైతులకు సాయం చేయాల్సింది పోయి పళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు దిగుతున్నారు అని సీఎం విమర్శించారు. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు.
వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎంను ప్రశ్నించగా.. 20 శాతం ధాన్యం మాత్రమే ఇంకా పెండింగ్‌లో ఉంది.. ఆ 20 శాతం కూడా పూర్తిగా సేకరిస్తాం. వరి వేసుకుంటే ఉరేసుకోవాలన్న ఆయన సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే మీరు చూపిస్తున్నారు. వడగళ్ల వాన పంట నష్టం జరిగితే రైతులకు సాయం చేయాల్సింది పోయి అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. రైతు చనిపోతే కూడా వారికి సహాయం చేయాల్సింది పోయి పళ్లు ఇకిలించుకుంటూ ఫొటోలు దిగుతున్నారు. రైతు చనిపోయిన విషయం అందరికి తెలిసిందే కదా.. మీ దొంగ సొమ్ము కొంచెమైనా ఆ రైతు కుటుంబాలకు ఇవ్వొచ్చు కదా అని అన్నారు.
కేటీఆర్‌కు మానవత్వం లేదు. మనిషికి ఉండాల్సిన విలువ లేదు. మనషులల్లాగా బీఆర్ఎస్ వాళ్లు బీహేవ్ చేయలేదు. వరి ధాన్యం కొనుగోళ్లు చేసిన తర్వాత డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు గతంలో 6 నెలలు పట్టేది.. మేం 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. హమాలీలు లేనందు వల్ల గ్యాప్ వచ్చింది. రైతుకు కొంచెం నష్టం వచ్చింది.. ఈ విషయంలో మాకు దుఃఖం ఉంది.. వీలైనంత వరకు కలెక్టర్లు మంత్రులను పంపించి ప్రయత్నం చేస్తున్నాం. మీకు కూడా ఏదైనా సూచన చేయండి.. శవ రాజకీయాలు వద్దు కొంచెమన్న సిగ్గుపడండి.. వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే అన్నోళ్లు రాజకీయాలు చేస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



