Indias fertiliser output falls | వార్ ఎఫెక్ట్.. భారత్‌లో ఐదేళ్ల కనిష్టానికి ఎరువుల ఉత్పత్తి
Indias fertiliser output falls | మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ఇంధన రంగంపైనేకాదు.. మన దేశంలో వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం కారణంగా ముడిసరుకుల కొరత ఏర్పడింది. ఫలితంగా మన దేశంలో ఎరువుల ఉత్పత్తి మార్చి నెలలో ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది (Indias fertiliser output falls).
Indias fertiliser output falls | మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ఇంధన రంగంపైనేకాదు.. మన దేశంలో వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎగుమతులు ఆగిపోవడంతో చేతికొచ్చిన పంట పొలాల్లోనే నిలిచిపోయింది. దీంతో అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇక భారతీయ ఉత్పత్తి రంగంపై ఈ వార్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. యుద్ధం కారణంగా ముడిసరుకుల కొరత ఏర్పడింది. ఫలితంగా మన దేశంలో ఎరువుల ఉత్పత్తి మార్చి నెలలో ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది (Indias fertiliser output falls). ఈ విషయం కేంద్ర వాణిజ్య శాఖ రిలీజ్ చేసిన డేటా ద్వారా వెల్లడైంది.
సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (Ministry of Commerce and Industry) విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఇండియాలో ఎరువుల ఉత్పత్తి మార్చిలో 24.6 శాతానికి పడిపోయింది. కీలక రంగాల సూచీ (Core Sector Index)లో ఎరువుల వాటా కేవలం 2.63% మాత్రమే. కోర్ సెక్టార్ సూచీలో ఎరువులను మినహాయిస్తే, సూచీ పడిపోకుండా స్థిరంగానే ఉండేదని గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 2026లో ఎరువుల ఉత్పత్తి సూచీ 95.7గా నమోదైంది. 2021 ఏప్రిల్ (అప్పుడు 88.3) తర్వాత ఇంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఎనిమిది కీలక రంగాలను ట్రాక్ చేసే కోర్ సెక్టార్ సూచీ ఏడాదికి 0.4 శాతం క్షీణించింది. మార్చిలో సూచీ పడిపోవడానికి ఎరువులు, క్రూడ్ ఆయిల్, బొగ్గు, విద్యుత్ రంగాలు ప్రధానంగా కారణమయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
హర్మూజ్ మూసివేయడంతో..
మన దేశంలో ఎరువుల ఉత్పత్తి రంగంలో యూరియా చాలా ప్రాధానమైంది. దీన్ని నేచురల్ గ్యాస్ ద్వారానే ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. విస్తృతమైన భారతీయ వ్యవసాయ రంగంలో యూరియాను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇంధన సరఫరాకు మూలస్తంభమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జలసంధి గుండా రావాల్సిన సహజ ఇంధన సరఫరాలు పడిపోయాయి. దీని వల్ల ఎరువుల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఫెర్టిలైజర్ ఉత్పత్తికి సంబంధించిన ఇన్‌పుట్స్ అన్నీ హర్మూజ్ జలసంధి మార్గం ద్వారానే ఇండియాకు వస్తుంటాయి.
ఫ్యాక్టరీలకు సహజ వాయువు సరఫరా 95% కి పెంపు..
ఎకనామిక్ సర్వే (Economic Survey) ప్రకారం భారత్ తన మొత్తం ఎరువుల వినియోగంలో సుమారు 27 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ఇదిలా ఉండగా ఎరువుల ఫ్యాక్టరీలకు అవసరమైన సహజ వాయువు (Natural Gas) సరఫరాను గతంలో 70% నుంచి 90%కి పెంచారు. ఇప్పుడు 90 నుంచి 95 శాతానికి పెంచారు. ఇక మార్చి నెలలో ఎరువుల ఉత్పత్తి 25 శాతానికి తగ్గడానికి ప్రధాన కారణం ప్లాంట్లకు గ్యాస్ సరఫరాను తాత్కాలికంగా 30 శాతానికి తగ్గించడమే.
ఎరువుల కర్మాగారాలకు సహజ వాయువు (Natural Gas) ఇంధనంగానే కాకుండా ముడిసరుకుగా కూడా పనిచేస్తుంది. వంట అవసరాల కోసం అందించే పీఎన్‌జీ (PNG), వాహనాల కోసం వాడే సీఎన్‌జీ (CNG) సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు.. ఎరువుల ప్లాంట్లకు ఇచ్చే గ్యాస్ కోటాను తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్‌లో గ్యాస్ సరఫరాను తిరిగి పెంచడం వల్ల ఉత్పత్తి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
అంతంతమాత్రంగానే ఇతర రంగాల పరిస్థితి
అదే సమయంలో ఇతర రంగాల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. బొగ్గు ఉత్పత్తి 4 శాతం తగ్గగా, క్రూడ్ ఆయిల్ 5.7 శాతం పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి కూడా 0.5 శాతం మేర క్షీణించింది. అయితే ఉక్కు, సిమెంట్ రంగాలు పెరుగుదల చూపించినప్పటికీ ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి నెలలో వీటి వేగం గణనీయంగా తగ్గింది. ఉక్కు రంగంలో ఫిబ్రవరిలో 7.6 శాతం వృద్ధి నమోదవగా.. మార్చిలో అది 2.2 శాతానికే పరిమితమైంది. ఇక సిమెంట్ ఉత్పత్తి ఫిబ్రవరిలో 8.9 శాతం పెరగగా, మార్చిలో 4 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది.
Also Read..
వామ్మో అన్ని కోట్లా.?...చిరంజీవి సినిమా కోసం ఏఆర్ రెహమాన్ షాకింగ్ రెమ్యూనరేషన్
భారతీయుల్లో పెరుగుతున్న హీట్ ఫీవర్, హీట్ స్ట్రోక్ సమస్యలు.. జాగ్రత్తలు తప్పనిసరి..
రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు ఎవరికీ మంచిది కాదు: చంద్రబాబుకు పొన్నం లేఖ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి
ఆగస్టు 13, 2026

LPG | ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు..? కేంద్రం కొత్త ప్లాన్‌తో వినియోగదారులపై భారం..?
ఆగస్టు 6, 2026

Alcohol Prices | యుద్ధం ఎఫెక్ట్.. రాష్ట్రంలో పెరుగనున్న మద్యం, బీర్ల ధరలు!
ఏప్రిల్ 6, 2026
తాజావార్తలు
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి
- ●Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ

Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్



